SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు కారం నిరాశ పరచడంతో నెక్స్ట్ రాబోతున్న సినిమా పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్టలేదు. నిజానికి ఈయన తెరకెక్కిస్తున్న సినిమాలకు కాస్త ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం మూడేళ్లు పట్టింది. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అంతే టైమ్ పడుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ సెంథీల్ తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో? అయన తప్పుకోవడానికి కారణం ఏంటి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాజమౌళి- సెంథిల్ మధ్య చెడిందా?
రాజమౌళి ఇప్పటివరకు చేసిన మగధీర, సై, ఈగ, బాహుబలి, RRR వంటి చిత్రాలకు కెమెరా మెన్ గా సెంథిల్ పనిచేసారు. ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. బాహుబలి సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. విదేశాల్లో ఈ సినిమాకు క్రేజ్ ఏ లెవల్ లో ఉనిందో అందరికి తెలుసు.. ఇక ట్రిపుల్ ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకుంది. అలాంటిది మహేష్ బాబు సినిమా చెయ్యకపోవడం ఏంటి అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. జక్కన్న సినిమాలను చక్కగా చూపించిన సినిమాటో గ్రాఫర్ తప్పుకోవడం ఏంటి? వీరిద్దరి మధ్య చెడిందా? ఇంకేదైనా కారణం ఉందా? అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కెమెరామెన్ సెంథిల్ ఏం చెప్పారంటే?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమాటోగ్రాఫర్ మహేష్, రాజమౌళి సినిమా గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. అయితే తాను ఈ సినిమా చెయ్యలేదని చెప్పాడు. భవిష్యత్ లో కొత్త టెక్నాలజీతో సరికొత్త అవకాశాలు వస్తాయని అన్నారు. ఏ టెక్నాలజీ అయిన మనం తీసుకొనే దాన్ని బట్టి ఉంటుంది. ఫ్యూచర్ లో కొత్తగా మళ్లీ అవకాశాలతో వస్తాను.. అని ఆయన అన్నాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో రాజమౌళితో చెడిందా? లేదా మహేష్ బాబు అంటే ఇష్టం లేదు. ఎందుకు తప్పుకున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసిందే.. మహేష్ బాబు – రాజమౌళి సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. పవర్ ఫుల్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఆ సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్ ను దించుతారా? అనేది చూడాలి..