Sailesh Kolanu..ప్రముఖ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాని (Nani ) నిర్మాణంలో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా వచ్చిన హిట్ (Hit) సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్టు అందుకోవడంతో ‘హిట్ -2’, ‘సైంధవ్’ సినిమాలు చేశారు. అడివి శేష్ (Adivi shesh) హీరోగా వచ్చిన ‘హిట్ -2’ మంచి విజయం సాధించింది. కానీ వెంకటేష్ (Venkatesh) 75వ చిత్రం గా వచ్చిన ‘సైంధవ్’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక హిట్ ఫ్రాంఛైజీ లో భాగంగా ఈసారి నాని(Nani ) హీరోగా ‘హిట్ 3’ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శైలేష్ కొలను. మే ఒకటవ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
యూట్యూబర్స్, రివ్యూవర్స్ పై డైరెక్టర్ మండిపాటు..
ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న డైరెక్టర్ అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అందులో భాగంగానే సినిమా రివ్యూ క్రిటిక్స్ అలాగే యూట్యూబర్స్ పైన ఊహించని కామెంట్లు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “నిజంగా నన్ను ఎక్కువ నిరాశపరిచింది యూట్యూబ్ రివ్యూలు. ముఖ్యంగా అక్కడ ఉపయోగించే లాంగ్వేజ్ అస్సలు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ప్రత్యేకించి థంబ్ నెయిల్స్.. లోపల కంటెంట్ ఏం లేకపోయినా సరే.. థంబ్ నెయిల్స్ లో మాత్రం ఘోరమైన బూతులు పెడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా పెట్టాల్సిన అవసరం ఏముంది.మీరే చెప్పండి మనకు సంబంధించిన ఒక దాని మీద అలాంటి థంబ్ నెయిల్స్ చూస్తే ఎలా ఉంటుంది..? అసలు మన సంస్కృతి ఎటు పోతోంది..? సమాజం ఏమైపోతుంది..? నిజానికి సినిమా క్రిటిక్ గా ఫస్ట్ మీ మీద మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అలా తప్పు థంబ్ నెయిల్స్ పెట్టేముందు కనీసం మిమ్మల్ని మీరైనా రెస్పెక్ట్ చేసుకోవాలి కదా..” అంటూ తెలిపారు.
also read: Hit 3: పుట్టిన 2 వారాలాకే తల్లి దూరం.. ఈ తల్లీకొడుకుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!
ఆ రెండు అంశాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి – శైలేష్ కొలను
ఇంకా మాట్లాడుతూ.. “సినిమా బాగాలేదు అని చెప్పమనండి. నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఇక్కడ మాత్రం నన్ను రెండు అంశాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి రివ్యూస్ లో జనాలు ఉపయోగించే లాంగ్వేజ్, రెండవది 8:30 కి ఫస్ట్ షో స్టార్ట్ అయితే సినిమా కంప్లీట్ అయ్యి ఈ ట్రాఫిక్ లో ఇంటికి వెళ్లి, కెమెరా సెట్ చేసుకొని, వీడియో చేసుకొని ఎడిట్ చేసి 1:30 కి రివ్యూ పోస్ట్ చేస్తున్నారు అంటే, అసలు మీరు నా సినిమా గురించి పది నిమిషాలు కూడా ఆలోచించడం లేదు అని నాకర్థమవుతోంది. రివ్యూ అనేది సినిమాకు ఇచ్చే విశ్లేషణ లాగా ఉండాలి. కానీ ఒక క్రిటిక్ గా మీరు సినిమా రివ్యూ ఇవ్వడం లేదు. నా వర్క్ ను క్రిటిక్ చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శైలేష్ కొలను చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సినిమా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలు అలాగే పెట్టే థంబ్ నెయిల్స్ వల్ల నిరాశ ఎక్కువ అవుతోంది అంటూ డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపారు. మరి ఇప్పటికైనా ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం ఆగుతాయేమో చూడాలి.