E-Paper
Advertisement

Shah Rukh Khan : డంకీ అంటే మీనింగ్ అదే.. టైటిల్ పై షారుక్ క్లారిటీ..

Shah Rukh Khan : డంకీ అంటే మీనింగ్ అదే.. టైటిల్ పై షారుక్ క్లారిటీ..
Advertisement
Shah Rukh Khan

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. విలక్షణమైన నటనతో పాటు భిన్నమైన కథలు.. అంతకుమించి విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తన హవా ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న షారూక్ ఖాన్.. డిసెంబర్ 21న ‘డంకీ’మూవీ తో హ్యాట్రిక్ సక్సెస్ సాధించాలి అని మంచి జోష్ మీద వస్తున్నాడు.

ఒకదాని తర్వాత ఒకటి వరుసగా బ్లాక్బస్టర్లు అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్లే కలెక్షన్స్ తో తన సొంతం కావడంతో ప్రస్తుతం షారుక్ ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం రాబోతున్న షారుక్ చిత్రంపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని అద్భుతంగా చిత్రం పై మంచి బజ్ నెలకొల్పేలా ఉన్నాయి. ఇక ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ రాజకుమార్ హిరానీ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు. బాలీవుడ్ లో అతని పేరుపై తిరుగులేని రికార్డు ఉంది దీంతో ఈ ఇద్దరి క్రేజీ కాంబోపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Advertisement

మూవీ కి సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి. దీంతో పాటుగా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ గురించి షారుక్ ఖాన్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అసలు ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం..

ఈ మూవీ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి.. టైటిల్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు.. దాని అర్థం ఏమిటి అని ఎంతోమంది ఆలోచించి ఉంటారు. దీనికి ఆన్సర్ షారుక్ ఈరోజు చాలా పొయటిక్ గా తన ట్వీట్లో తెలియపరిచారు.

Advertisement

‘డంకీ.. అంటే ఏంటి అని చాలామంది అడిగారు.. నిజానికి దీని అర్థం మనకు ఎంతో ఇష్టమైన వారికి దూరంగా ఉండాల్సి రావడం. మన కుటుంబాలతో మనకు ఉన్న బంధం కారణంగా చివరి క్షణం వరకు వాళ్లతోనే కలిసి ఉండాలి అని భావిస్తాం…ఓ మహి ఓ మహి….ఈరోజు సూర్యుడు అస్తమించే ముందు ప్రేమను అనుభవించు’అంటూ షారుఖ్ రాసిన ట్వీట్ బాగా వైరల్ అయింది.మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మహి అని సాగే సాంగ్ సంబంధించిన ప్రోమో ని డ్రాప్ 5 పేరిట ఈరోజు విడుదల చేయబోతున్నారు అదే విషయాన్ని షారూక్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×