Chandoo Mondeti: ఈరోజుల్లో ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యిందంటే చాలావరకు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు దానిని ఫాలో అవుతున్నారు. దానినే సేఫ్ గేమ్ లాగా ఫీలవుతున్నారు. చాలావరకు యంగ్ డైరెక్టర్స్ కూడా ఒకరిని చూసి మరొకరు ఈ సేఫ్ గేమ్‌లో భాగమయిపోతున్నారు. తాజాగా ‘తండేల్’ డైరెక్టర్ కూడా ఇతర తెలుగు దర్శకులలాగానే ఒక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చందూ మోండేటి తెరకెక్కించిన సినిమాలు చాలావరకు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అదే నమ్మకంతో ‘తండేల్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ‘తండేల్’ తర్వాత తన సినిమా ఎవరితో అన్న ప్లానింగ్ అప్పుడే మొదలుపెట్టేశాడు ఈ యంగ్ డైరెక్టర్.
తమిళ హీరోతో
ఒకప్పుడు ఒక భాష దర్శకుడు.. అదే భాషలోని హీరోతో సినిమాలు చేయడానికి ఎదురుచూసేవాడు. కానీ రోజులు మారిపోయాయి. తెలుగు హీరోలు బిజీగా ఉంటే వెంటనే తమిళ, మలయాళ హీరోల కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు దర్శకులు. యంగ్ డైరెక్టర్లు మాత్రమే కాదు సీనియర్ దర్శకులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు హీరోలు దాదాపు 2,3 ఏళ్ల వరకు తీరిక లేని ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. అందుకే కొత్త సినిమాలను యాక్సెప్ట్ చేసేంత ఫ్రీగా వారు లేరు. కానీ తమిళ, మలయాళ హీరోలు మాత్రం తమ మొదటి ప్రాధాన్యత తెలుగు దర్శకులకే ఇస్తున్నారు. అందుకే ‘తండేల్’ ఫేమ్ చందూ మోండేటి కూడా తమిళ హీరో కోసం ఎదురుచూపులు మొదలుపెట్టాడు.
అతడి కోసమే
చందూ మోండేటి (Chandoo Mondeti) చివరి సినిమా ‘కార్తికేయ 2’. ఈ మూవీ దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత సూర్య.. తనతో పనిచేయాలని ఉందంటూ పర్సనల్‌గా చెప్పాడని ‘తండేల్’ (Thandel) ప్రమోషన్స్‌లో బయటపెట్టాడు చందూ మోండేటి. అందుకే సూర్య (Suriya) కోసం రెండు స్టోరీ లైన్స్ సిద్ధం చేశానని, ఆ రెండూ సూర్యకు నచ్చాయని, అందులో ఏదో ఒకటి కచ్చితంగా ఫైనల్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. అయితే సూర్య.. మరొక తెలుగు డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరితో కూడా కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ‘తండేల్’ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల అవుతండగా.. ఇది హిట్ అయితే తమిళం నుండి చందూకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేక ఎన్టీఆర్ సినిమా వదిలేశాడా.?
ఇదే ఫార్ములా
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తమిళ హీరో అయిన ధనుష్‌తో ‘సార్’, మలయాళ హీరో అయిన దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ లాంటి సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్లు అందుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి సైతం కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ స్టార్ హీరో అయిన విజయ్‌ను డైరెక్ట్ చేశాడు. పవన్ సాధినేని కూడా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో కలిసి పనిచేస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఏకంగా సన్నీ డియోల్‌తో చేసే ‘జాట్’తో బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యాడు.