BigTV English

KrishnaVamsi- RamyaKrishna: భార్యకు విడాకులు.. స్పందించిన డైరెక్టర్.!

KrishnaVamsi- RamyaKrishna: భార్యకు విడాకులు.. స్పందించిన డైరెక్టర్.!

KrishnaVamsi- RamyaKrishna:టాలీవుడ్ లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కృష్ణవంశీ (Krishna Vamsi) కూడా ఒకరు. ఆయన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) శిష్యుడిగా ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీసి గుర్తింపు సంపాదించారు.అయితే అలాంటి స్టార్ డైరెక్టర్ అయినటువంటి కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishna) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.వీరిలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ – దర్శకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ జంట కూడా ఒకటి..అయితే వీరి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా కూడా వీరు కలిసి ఉంది చాలా తక్కువ..అవును.. మీరు వినేది నిజమే.. రమ్యకృష్ణ – కృష్ణవంశీ పేరుకే భార్య భర్తలు.. కానీ ఎక్కడ కూడా వీరిద్దరూ ఒక్కటిగా కనిపించింది లేదు. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, కేవలం కొడుకు కోసమే కలిసి ఉంటున్నారని ఎన్నోసార్లు రూమర్లు వినిపించాయి.అయితే ఈ రూమర్లపై రీసెంట్ గా ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కృష్ణవంశీ. మరి భార్యతో విడాకులపై కృష్ణవంశీ ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం..


రమ్యకృష్ణ – కృష్ణవంశీ విడిపోయారా?

రమ్యకృష్ణ, కృష్ణవంశీల వివాహం 2003 జూన్ 12న జరిగింది. వీరి పెళ్ళై ఇప్పటికే 22 సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా వీరి వైవాహిక బంధంలో కలిసి ఉంది చాలా తక్కువ. అయితే వీరిద్దరూ ఒకరు హైదరాబాదులో, మరొకరు చెన్నైలో ఉండడంతో నిజంగానే వీరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారనే రూమర్ అప్పట్లో ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయిందని, కృష్ణవంశీ హైదరాబాదులోనే ఉంటున్నారని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఉంటుందా అని ఎంతోమంది మాట్లాడుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చాలాసార్లు కొట్టి పారేశారు కృష్ణవంశీ.


విడాకుల రూమర్స్ పై స్పందించిన కృష్ణవంశీ..

అయినా రూమర్స్ ఆగకపోవడంతో మళ్లీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రమ్య కృష్ణ చెన్నైలో , నేను హైదరాబాదులో ఉన్నందుకు చాలామంది మేము విడాకులు తీసుకున్నామని అంటున్నారు.కానీ మా విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేం కూడా అందరు భార్యాభర్తల్లాగే పార్టీలకు,ఫంక్షన్లకు వెళ్తాము. కానీ మా ఇద్దరికీ సంబంధించి కలిసి ఉన్న ఫోటోలను బయట పెట్టడానికి అంతగా ఇష్టపడడం. ఎందుకంటే అవి మా పర్సనల్స్ కాబట్టి.. మేం ఎవరితోనూ షేర్ చేసుకోం.. అవి మా వ్యక్తిగతం..అలాగే సమయం దొరికినప్పుడల్లా రమ్యకృష్ణ నేను తరచూ కలుస్తూనే ఉంటాం. కానీ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఆమె చెన్నైలో, నేను హైదరాబాద్ లో ఉంటున్నాం. అలాగే మేమిద్దరం వేరువేరుగా ఉండొచ్చు.. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. వేరువేరుగా ఉంటే విడాకులు తీసుకున్నామని ఏవేవో కథలు అల్లేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. రమ్యకృష్ణ తన సినీ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది” అంటూ తన భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కృష్ణవంశీ.అలాగే విడాకులు తీసుకోలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక కృష్ణవంశీ క్లారిటీతో రమ్యకృష్ణ – కృష్ణవంశీలు విడిపోలేదని, కలిసే ఉన్నారని అందరికీ క్లారిటీ వచ్చింది.

Actress Mahalakshmi: మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.. రవీందర్ భార్య కామెంట్స్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×