Shahrukh Khan:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh khan) అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రిచెస్ట్ హీరోగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన, తాజాగా దక్షిణాది హీరోలను ఉద్దేశిస్తూ.. చేసిన ఆసక్తికర కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే, 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో తన కెరియర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. అలాగే దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు.
సౌత్ హీరోల డాన్స్ పై షారుఖ్ ఖాన్ కామెంట్స్..
అందులో భాగంగానే సౌత్ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ (Rajinikanth), విజయ్ దళపతి (Vijay thalapathy), ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్(Allu Arjun) హీరో యష్(Yash) వంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులు అని తెలిపిన ఈయన, సౌత్ హీరోల డాన్స్ గురించి కూడా పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ వేదికపై షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి కేరళ, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. అలాగే చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. ప్రథమంగా వారిలో ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు(Maheshbabu), యష్, రజనీకాంత్, కమల్ హాసన్ (Kamal Hassan), విజయ్ దళపతి నాకు మంచి స్నేహితులు. అయితే వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పాటలకు చాలా వేగంగా డాన్స్ చేయడం ఆపేయండి. డాన్స్ విషయంలో వారిని ఫాలో అవ్వడం మాకు కష్టంగా మారింది. ఈ వయసులో నేను మీలాగా డాన్స్ చేయలేను. దయచేసి నా అభిప్రాయాన్ని గౌరవించండి ” అంటూ సరదాగా కామెంట్లు చేశారు. షారుక్ ఖాన్ మొత్తానికైతే సౌత్ హీరోల డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ వారి స్థాయికి తాము చేరుకోలేము అనే రేంజ్ లో కామెంట్లు చేశారని నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సౌత్ హీరోల టాలెంట్ పై షారుఖ్ ప్రత్యక్షంగానే కామెంట్లు చేశారని పొగుడుతూ ఉండడం గమనార్హం.
కింగ్ మూవీపై కామెంట్స్..
అలాగే తన తదుపరి సినిమా గురించి కూడా షారుఖ్ ఖాన్ మాట్లాడారు. గతంలో బ్లాక్ బాస్టర్ సినిమాకి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)తో నేను మళ్ళీ కలిసి పనిచేస్తున్నాను. అదే ‘కింగ్’మూవీ.. ఈ కింగ్ సినిమాలో నా కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) తో నేను కలిసి పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) విలన్ గా నటిస్తున్నారు అంటూ షారుక్ ఖాన్ తెలిపారు. ఇకపోతే షారుక్ ఖాన్ చివరిగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో వచ్చిన ‘డుంకీ’ సినిమాలో కనిపించారు. ఇక కింగ్ సినిమా తప్పకుండా మీకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇప్పుడు మన దగ్గర మంచి మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాము. రాజు ఎప్పటికీ రాజే కదా అంటూ ఈ వేదికపై నవ్వులు పూయించారు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.