BigTV English

Ramcharan: మెగా హీరోకి అవమానం, క్షమాపణలు కోరిన ఫ్యాన్స్‌

Ramcharan: మెగా హీరోకి అవమానం, క్షమాపణలు కోరిన ఫ్యాన్స్‌


Ramcharan: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఎంతోమంది సెలబ్రిటీల మధ్య చాలా సందడి జరుగుతున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతి వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా రామ్‌చరణ్‌ని  ఇటీవలే మెగా హీరో రామ్‌చరణ్.. ముగ్గురు బాలీవుడ్ హీరోలతో కలిసి నాటునాటు సాంగ్‌కు స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. మరో వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా రామ్‌చరణ్ భార్య ఉపాసన మేకప్ మ్యాన్..ఈ వేడుకలో రామ్‌చరణ్‌కు అవమానం జరిగిందని వివరించింది. ఇంతకీ ఈ ఈవెంట్‌లో ఏం జరిగిందనేది తెలుసుకుందాం.


తాజాగా జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ హీరోలతో పాటు రామ్ చరణ్ స్టెప్పులు వేశాడు. అయితే అప్పుడే చరణ్‌ని స్టేజ్ మీదకు పిలుస్తూ.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారట. రామ్‌చరణ్‌ను అవమానిస్తూ స్టేజీ మీదకు పిలిచినట్లు తెలుస్తోంది. అది జీర్ణించుకోలేని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ఈ పార్టీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపింది. చెర్రీని షారుక్ అలా అనడం తనకు అస్సలే నచ్చలేదంటూ వివరించింది.

Read More: ‘ది ఫ్యామిలీ స్టార్‌’ టీజర్ రిలీజ్.. మాస్ మెన్ విత్ ఫ్యామిలీ!

షారుక్ ఖాన్.. ఇడ్లీ, వడ అని సంబోధిస్తూ.. రామ్‌చరణ్‌ను వేధికపై ఆహ్వానించడం అస్సలు నచ్చలేదంటూ జెబా హాసన్ వివరించింది. సందర్భం సరదాగానే ఉన్నప్పటికీ.. బాలీవుడ్ స్టార్ హీరో ఇలా ఓ సౌత్ స్టార్ హీరోను పిలవడం నిజంగా అగౌరవపరచడమేనని ఆమె తెలిపింది. అంతేకాదు.. ఇలాంటి సిచ్చువేషన్‌లో… సౌత్ హీరోలు ఎవరైనా.. బాలీవుడ్ హీరోలను వడా పావ్, భేల్ పూరీ అని పిలిస్తే మీరు అంగీకరిస్తారా అంటూ ఆమె ప్రశ్నించింది.

గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాను అస్సలే జీర్ణించుకోలేకపోయానని.. అందుకే పార్టీ నుంచి వాకౌట్ చేశానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీనిపై నెటిజెన్లు సైతం పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

చెర్రీకి వచ్చిన రెస్పాన్స్ చూసి తట్టుకోలేక ఆయన అలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అగౌరవపరచడం సరైన పద్ధతి కాదని ఫైర్ అవుతున్నారు. చెర్రీకి షారుక్ ఖాన్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి మరి.. ఈ ఘటనపై రామ్ చరణ్, షారుక్ ఖాన్‌లు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×