BigTV English

‘The Family Star’ Movie Teaser: ‘ది ఫ్యామిలీ స్టార్‌’ టీజర్ రిలీజ్.. మడతెట్టేసిన విజయ్ దేవరకొండ!

‘The Family Star’ Movie Teaser: ‘ది ఫ్యామిలీ స్టార్‌’ టీజర్ రిలీజ్.. మడతెట్టేసిన విజయ్ దేవరకొండ!


Rowdy Star Vijay Devarakonda’s The Family Star Taser: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్..ఈ మూవీ టీజర్‌ని సోమవారం రాత్రి 8.19 గంటలకు రిలీజ్‌ అనుకోగా.. కొంత ఆలస్యమైంది. ఈ మూవీకి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్‌సమ్ టైనింగ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఈ మూవీ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీని ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి తీసుకురాబోతున్నారు. మరోనెల రోజులు టైం మాత్రమే ఉండటంతో మూవీ ప్రమోషన్స్ యాక్టివిటీస్‌ స్పీడప్ చేసింది ఈ మూవీ టీం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టైటిల్‌ గ్లింప్స్, పోస్టర్స్, నంద నందనా లిరికల్ సాంగ్‌ని ఆడియెన్స్‌ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌ హిట్ కానుందనే ఇండికేషన్స్‌ ఆడియెన్స్‌కి ఇస్తున్నాయి.


ఇక గీత గోవిందం విజయం తరువాత..దర్శకుడు పరశురామ్ పెట్ల ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ స్టార్ కోసం విజయ్ దేవరకొండతో మళ్లీ చేస్తున్నారు.ఈ మూవీలో హీరో లవర్‌గా మృణాల్ ఠాకూర్ నటించారు. టీజర్ కొంచెం ఆలస్యమైనప్పటికీ, అది విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ టీజర్‌ ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. తన ఫ్యామిలీ కోసం ఎంతదూరమైనా వెళ్లడానికి ఇష్టపడే వ్యక్తిగా విజయ్‌ని టీజర్‌లో కనిపించారు. యాక్షన్ సీన్స్, ఆకర్షణీయమైన ర్యాప్ ట్రాక్‌తో ఫ్యామిలీ డైనమిక్స్‌ను మిక్స్‌ చేస్తూ.. టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇక విజయ్ ఫ్యాన్స్‌కి సినీ ప్రియులకి ఈ మూవీ ఎంటర్‌టైన్ చేయనుంది.

Read More: సలార్ 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. అఫీషియల్‌గా చెప్పేసిన నటుడు

ఇక గతంలో.. విజయ్ దేవరకొండ స్పీడ్ ఆ మధ్య ఓ రేంజ్‌లో ఉండేది. కానీ తన మూవీస్ హిట్ రేటింగ్‌ తగ్గడంతో కాస్త స్లో అయిపోయాడు. దీనికి కారణం గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన లైగర్ మూవీ ఫ్లాప్ కావడంతో పాటుగా ఖుషీ మూవీ కూడా అనుకున్నంతగా థియేటర్‌లో ఆడకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

ఆ తర్వాతే ఆలోచనల్లో పడ్డ హీరో విజయ్ మొత్తానికి తన దూకుడును పెంచాడు. ప్రస్తుతం ఒకేసారి బ్యాక్‌ టూ బ్యాక్‌ 3 సినిమాలు చేయబోతున్నాడు. ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ దేవరకొండ పోలీస్‌ ఆఫీసర్‌గా మారి..లాఠీ తిప్పబోతున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న తన మూవీస్‌తో ఆడియెన్స్‌ని ఎంతలా ఆకట్టుకుంటాడో అని ఆడియెన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×