BigTV English

Shankar: డైరెక్టర్ శంకర్ సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్కదారి.. మారేనా..?

Shankar: డైరెక్టర్ శంకర్ సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్కదారి.. మారేనా..?

Shankar:ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar ) అనగానే అందరికీ భారీ బడ్జెట్ గుర్తుకొస్తుంది. భారీ కాన్వాస్ తో సినిమాలు తీయడం, దానికోసం అసాధారణ బడ్జెట్లను పెట్టుబడిగా పెట్టించడం ఆయనకు ముందు నుంచి ఉన్న అలవాటు. “ది జెంటిల్మెన్” సినిమా మొదలు ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రానికి కూడా పాటలు, ఫైట్స్ అన్నీ విజువల్ గ్రాండియారిటీ కోసం.. విజువల్ రిచ్ సెట్స్ నిర్మాణం , ప్రపంచంలోనే ఎగ్జోటిక్ లొకేషన్ లో 7 వింతల పరిసరాలలో సన్నివేశాలను చిత్రీకరించడం, వీఎఫ్ఎక్స్ మాయాజాలం కోసం నిర్మాతలను భారీ బడ్జెట్ ఖర్చు చేసేలా చేస్తూ ఉంటారు. అందుకే శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు సైతం వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ ఆయనతో సినిమా చేయాలి అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఖర్చు చేసినా.. లాభం వస్తుందా అంటే? చెప్పలేని పరిస్థితి.


శంకర్ ను నమ్మి నిర్మాతలు ముందుకొస్తారా..?

ఉదాహరణకు ఇటీవలే శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాను రామ్ చరణ్ (Ram Charan) తో చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వందల కోట్లు ఖర్చు చేశారు దిల్ రాజు(Dilraju ) కానీ ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీని బట్టి చూస్తే నిర్మాతకు ఎంత లాస్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే శంకర్ తో సినిమా చేయడానికి అటు హీరోలే కాదు ఇటు నిర్మాతలు కూడా భయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శంకర్ తో నెక్స్ట్ సినిమా చేయాలంటే నిర్మాతలు నమ్మే పరిస్థితి ఉందా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మునుపటిలాగా భారీ బడ్జెట్ లు కేటాయించి, శంకర్ తో సినిమా తీయాలి అంటే ముందు ఆయనను నమ్మే పరిస్థితి రావాలి. దానికోసం సరైన బ్లాక్ బాస్టర్ ను ఇండస్ట్రీకి శంకర్ అందివాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 భారీ డిజాస్టర్ గా మారడంతో ఇప్పుడు ఆయనను నమ్మే పరిస్థితిలో ఇండస్ట్రీ లేదని అటు ట్రేడ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక సుదీర్ఘకాలంగా భారీ బడ్జెట్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తక్కువ బడ్జెట్ లో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంటే మాత్రం మళ్లీ ఆయనను నమ్మే అవకాశం ఉంది. లేకపోతే ఆయనను నమ్మి పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రారు. పైగా అన్ని కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడానికి హీరోలు కూడా వెనుకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు.ఇకపోతే శంకర్ తెరకెక్కించిన తదుపరి చిత్రం భారతీయుడు3 విడుదల కాబోతోంది. కానీ ఈ భారతీయుడు 2 ఫ్లాప్ కారణంగా దీని ప్రభావం ఎలా ఉంటుందో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


స్క్రిప్ట్ విషయంలోనే అసలు సమస్య..

అయితే శంకర్ మునుపటిలాగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలి అంటే ఆయనకు సుజాత రంగరాజన్(Sujatha Rangarajan)లాంటి మరో రచయిత పుట్టుకొస్తేనే శంకర్ తిరిగి మునుపటిలా విజయాలు అందుకుంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే శంకర్ లాంటి గొప్ప దర్శకుడికి కథాంశం , స్క్రిప్ట్ మేటర్ విషయంలోనే ప్రాబ్లం వున్నాయట. ముఖ్యంగా ‘రోబో’ సినిమా వరకు శంకర్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఈ చిత్రం వరకు కూడా శంకర్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి ది గ్రేట్ రచయిత సుజాత రంగరాజన్ స్క్రిప్ట్ అందించే వాళ్ళు. ఇక రోబో సినిమా సమయంలో ఆయన మరణించడంతో ఆ తర్వాత నుంచి సరైన కథను అందించే వాళ్ళు లేక డైరెక్షన్లో ఆయన పట్టు తప్పుతోందని సమాచారం. మరి మళ్ళీ సుజాత లాంటి రచయిత పుట్టుకొచ్చి శంకర్ కు సహాయం చేస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×