BigTV English

YSRCP: ఉత్తరాంధ్ర కొత్త బాస్ ఎవరు? రేసులో బొత్స.. హైకమాండ్ మాటేంటి?

YSRCP: ఉత్తరాంధ్ర కొత్త బాస్ ఎవరు? రేసులో బొత్స.. హైకమాండ్ మాటేంటి?

YSRCP: వైసీపీలో కొత్తగా జరుగుతున్న లుకలుకలేంటి? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ పదవి ఎవరికి దక్కుతుంది? నమ్మిన బంటును తీసుకొచ్చి జగన్ పెడతారా? ఆ ప్రాంతం వారికే ఆ పదవి అప్పగిస్తారా? ఇంతకీ జగన్ మదిలో ఏముంది? ఆ పదవికి ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్కడ పెట్టాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. దీంతో ఫ్యాన్ పార్టీలో ఆయన శకం ముగిసింది. ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్ర నేతలు సంబరాలు చేసుకున్నారు. స్థానికేతర నాయకుడ్ని తమ నెత్తిన రుద్దుతున్నారంటూ కొందరు గుర్రుగా ఉన్నారు. సాయిరెడ్డి వెళ్లిపోవడంతో  నేతలు రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ పదవి తమ ప్రాంతం వారికి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు.

ఈ పదవికి ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు నేతలు పోటీపడుతున్నారట. తొలుత ఈ పదవి వైవీ సుబ్బారెడ్డి అప్పగించాలని ప్లాన్ చేసిందట వైసీపీ హైకమాండ్. కాకపోతే ఉత్తరాంధ్ర నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు సమాచారం. వైవీ హయాంలో కేవలం రెండు సీట్లకు పార్టీ పరిమితమైందని, ఆయనకు ఇస్తే కేడర్ చెదిరిపోయే ప్రమాదముందని నేతలు అధిష్టానం వద్ద ప్రస్తావించారట. ఆ పదవికి ఉత్తరాంధ్ర నేతలను నియమించాలనే ఆలోచన చేస్తోంది.


ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికి ముగ్గురు నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా మాజీ మంత్రులే కావడం గమనార్హం. ఒకరు ధర్మాన ప్రసాదరావు, మరొకరు బొత్స సత్యనారాయణ, ఇంకొకరు గుడివాడ అమర్నాథ్. తొలుత ఈ పదవిని ధర్మాన ప్రసాదరావు లేదా కృష్ణదాస్‌కు ఇవ్వాలని భావించిందట. తర్వాత ఏమైందోగానీ వెనక్కి తగ్గిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ:  జమ్మలమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందికి గాయాలు

ఓటమి తర్వాత ప్రసాదరావు పార్టీలో యాక్టివ్‌గా లేరు. కేడర్‌ను పలకరించిన పాపాన పోలేదు. జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలకు, ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ఆ పదవి ఇచ్చినా న్యాయం చేస్తారన్న నమ్మకం నేతల్లో కనిపించలేదు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వెలుగులోకి వచ్చింది. తొలుత ఆయనను ఆ పదవి ఇవ్వాలని భావించినా, ఎందుకోగానీ ఆ పార్టీ వెనక్కి తగ్గిందని సమాచారం. కేవలం ప్రత్యర్థులపై విమర్శలు తప్పితే.. నేతలు, కేడర్‌తో ఆయనకు అంతగా సంబంధాలు లేవన్నది వైసీపీ అంతర్గత రిపోర్టులో తేలిందట. దీంతో ఆయన్ని పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది.

ఇక మూడో వ్యక్తి మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రేసులో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పదవి ఆయనకు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మండలిలో అడుగుపెట్టడం, ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆ తరహా హోదా వైసీపీలో కేవలం బొత్సకు మాత్రమే ఉంది.

బొత్స సామాజిక వర్గం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలంగా ఉంది. నేతలను సమన్వయం చేసి కలిసి పని చేసిన నేతగా ముద్ర ఉంది. ఆయనకు ధీటైన నేత లేకపోవడంతో కలిసి రావడం ఖాయమని అంటున్నారు. రేపో మాపో ఉత్తర్వులు రావచ్చన్నది బొత్స మద్దతుదారుల మాట. మరి హైకమాండ్ బొత్సకు ప్రయార్టీ ఇస్తుందా?

ఎలాగూ ప్రతిపక్ష నేతగా ఉండడంతో మరొకరికి ఆ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఉత్తరాంధ్ర నేతలను వెంటాడుతున్నాయి. కాకపోతే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్యపోనకర్లేదని అంటున్నారు. గడిచిన పదేళ్లు ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ పదవిని దగ్గరవాళ్లుకు మాత్రమే ఇచ్చారు జగన్. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇచ్చినా ఆశ్యర్యపోనకర్లేదని అంటున్నారు. మొత్తానికి ఈ గాసిప్స్‌కు తెరపడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు మరీ.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×