BigTV English
Advertisement

Shanmukh Jaswanth Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలనం.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్న షణ్ముఖ్

Shanmukh Jaswanth Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలనం.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్న షణ్ముఖ్
shanmukh jaswanth ganjai case update
shanmukh jaswanth ganjai case update

Shanmukh Jaswanth Ganja Case Update: ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో సంచలన నిజాలు బట్టబయలు అయ్యాయి. ఇప్పటికే పోలీసులు నిర్వహించిన టెస్టుల్లో షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్టు తేలగా.. ఇప్పుడు తనంతట తానే గంజాయి తీసుకున్నట్టు ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. డిప్రెషన్ లో ఉన్న కారణంగానే గంజాయి సేవిస్తున్నట్టు వెల్లడించాడు షణ్ముఖ్. తన పరిస్థితి ఏం బాగోలేదని.. ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది.


మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్ బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. 2016 లో Thik shake ప్రాంచైజీ పేరుతో తన MBA క్లాస్ మెట్ నుంచి.. రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలానే ఇప్పటికే ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన తర్వాత.. ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా.. డాక్టర్ దివ్య పూజను వివాహం చేసుకున్నాడు సంపత్. అయితే అంతకు ముందే ముంబైలో మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ మహానుభావుడు ఇంకెన్ని బాగోతాలు చేశాడో అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More: షణ్ముఖ్‌ బయటపడ్డ నిజస్వరూపం.. అమ్మాయిలను మోసం చేయటం, డ్రగ్స్, లైంగిక దాడి, అబార్షన్.. మరెన్నో!


షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్.. సంపత్ వినయ్ (31) యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన డాక్టర్ మౌనికతో షణ్ముఖ్ కు పరిచయం ఉండగా.. అతని ద్వారానే సంపత్ ఆమెకు 2015లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్యన పరిచయం ప్రేమగా మారి.. నిశ్చితార్థం వరకూ వెళ్లింది. గతేడాది డిసెంబర్ లో వీరి వివాహం జరగాల్సి ఉండగా.. యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న పెళ్లి చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. ఇంతలోనే సంపత్ కు మరో యువతితో 27న పెళ్లి చేస్తున్నట్లు అతని తల్లిదండ్రులు యువతికి చెప్పడంతో.. సదరు యువతి నార్సింగి పీఎస్ లో సంపత్ పై చీటింగ్ కేసు పెట్టింది. ఆ కేసు విషయమై వెళ్లగా.. షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×