BigTV English

Tamanna on Sura Movie: తమిళ స్టార్ హీరో విజయ్‌ సినిమాపై తమన్నా విమర్శలు.. అదొక సినిమానా అంటూ..

Tamanna on Sura Movie: తమిళ స్టార్ హీరో విజయ్‌ సినిమాపై తమన్నా విమర్శలు.. అదొక సినిమానా అంటూ..


Tamanna Sensational Comments on Vijay Thalapathy’s ‘Sura’ Movie: దక్షిణాది సినీ పరిశ్రమలో తమన్నా స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 19 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. భాషలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవలే రజనీకాంత్ ‘జైలర్’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’లో నటించింది.

అయితే ఈ మధ్య ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినిమా, వ్యక్తిగత విషయాలతో హైలెట్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి తమన్నా తన మాటలతో వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ హీరో దళపతి విజయ్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. దీంతో తమన్నా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


దళపతి విజయ్, తమన్నా జంటగా నటించిన ఒకప్పటి మూవీ ‘సురా’. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకొని అందరినీ షాక్‌కి గురిచేసింది. అంతేకాకుండా ఈ మూవీ విజయ్‌ కెరీర్‌లో 50వ చిత్రం కూడా. ఈ మూవీ విడుదలైన ఇన్నేళ్లకు ఈ ముద్దుగుమ్మ ఈ మూవీపై విమర్శలు చేసింది.

Read More: నిర్మాతగా మారిన అలియా భట్.. టాప్ వన్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్

మొదట్లో ఈ సినిమాలో విజయ్‌తో స్క్రీన్ చేసుకోవడంపై ఫుల్ హ్యాపీ అయిన తమన్నా.. మూవీ డిజాస్టర్ కావడంతో తీవ్ర నిరాశకి గురైనట్లు తెలిపింది. ఈ మేరకు అదొక సినిమానా అంటూ హేళ చేస్తూ మాట్లాడింది. ఈ మూవీలో నటించినందుకు చాలా బాధపడినట్లు పేర్కొంది.

ఈ మూవీలో తనకు నచ్చని కొన్ని సీన్స్ ఉన్నాయని తెలిపింది. మొత్తానికి తాను చేసిన చెత్త సినిమాల్లో సురా సినిమా ఒకటని తమన్నా మాట్లాడినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ‘ఆర్టికల్ 370’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

మరి ఈ కామెంట్స్‌పై విజయ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా త్వరలో చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×