BigTV English
Advertisement

Sharwa 37 Update : శర్వానంద్ కోసం కొణిదెల – నందమూరి ఫ్యామిలీలు… లక్ అంటే నీదే బాసూ

Sharwa 37 Update : శర్వానంద్ కోసం కొణిదెల – నందమూరి ఫ్యామిలీలు… లక్ అంటే నీదే బాసూ

Sharwa 37 Update :ఈ మధ్యకాలంలో జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే నటులలో హీరో శర్వానంద్ (Hero Sharwanand) ప్రథమ స్థానంలో ఉంటారు. గత ఏడాది ఆయన ‘మనమే’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన, అందులో దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju)తో చేస్తున్న సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శర్వానంద్ కెరియర్ లో 37వ చిత్రంగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తెరపైకి రావడంతో అటు నందమూరి, ఇటు మెగా అభిమానులలో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


శర్వా సినిమా పోస్టర్ రిలీజ్ కి నందమూరి, మెగా హీరోలు..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద చేయబోతున్నామంటూ.. ఆ విడుదల తేదీని కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నందమూరి(Nandamuri), కొణిదెల(Konidela) హీరోల చేతుల మీదుగా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపింది చిత్ర బృందం. ఇక దీంతో మెగా, నందమూరి, శర్వా అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


అదృష్టం అంటే ఈయనదే..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ,ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ లాంఛ్ కి మెగా, నందమూరి హీరోలు కలిసి వస్తున్నారని తెలియడంతో లక్ అంటే ఈ హీరోదే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా మొదటితోనే హైపు పెంచేస్తున్నారు. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

హీరో శర్వానంద్ కెరియర్..

హీరో శర్వానంద్ విషయానికి వస్తే.. తెలుగు చలనచిత్ర నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన గమ్యం, ప్రస్థానం వంటి చిత్రాలలో నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.. శర్వానంద్ తెలుగులోనే కాదు తమిళ్ చిత్రాలలో కూడా నటించారు. విజయవాడ లో పుట్టిన శర్వానంద్, హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అప్పుడు రానా దగ్గుబాటి (Rana daggubati), రామ్ చరణ్ తేజ(Ram Charan Tej) క్లాస్మేట్ గా ఉండే వాళ్ళట. చాలా ఏళ్లు కలిసి చదువుకున్న వీరి మధ్య ఎప్పుడూ కూడా సినిమాల ప్రస్తావన వచ్చేది కాదని సమాచారం. ఇక శర్వానంద్ తండ్రి ప్రసాద్ రావు వ్యాపారవేత్త ,తల్లి వసుంధర దేవి గృహిణి .ఈయనకు అన్నయ్య కళ్యాణ్ తో పాటు అక్క రాధిక కూడా ఉన్నారు. శర్వానంద్ కి చదువు కంటే, ఉద్యోగం చేయడం కంటే, సినిమాల పైన ఎక్కువ ఇష్టం ఉండేదట. అందుకే ఇంటర్ పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల సలహా మేరకు డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×