Mohan Babu: గత కొన్నిరోజులగా సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు అవ్వడం, వారిని జైలుకు తీసుకెళ్లడం, వారు ఈ కేసుకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగడం వంటి అంశాలు హైలెట్‌గా మారాయి. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కంటే ముందే మరొక సీనియర్ హీరోకు ఈ లీగల్ కష్టాలు మొదలయ్యాయి. ఆయన మరెవరో కాదు మంచు మోహన్ బాబు. ఫ్యామిలీ సమస్యలను పబ్లిక్ ముందు తీసుకొచ్చే సరికి అవి మరింత పెద్దగా అయ్యాయి. మధ్యలో మీడియా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు వారిపై దాడి చేసి సమస్యలను మరింత పెంచుకున్నాడు. ఆ విషయంలో మోహన్ బాబు అరెస్ట్ కూడా కావాల్సింది కానీ ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అందుకే కేసు
మంచు ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు బయటపడింది. చాలాకాలం క్రితం మంచు విష్ణు (Manchu Vishnu).. మంచు మనోజ్ (Manchu Manoj)ను బెదిరిస్తున్న వీడియో ఒకటి బయటికి రాగా అది కేవలం రియాలిటీ షో అని, ఆ షోకు సంబంధించిన ప్రోమో అని కవర్ చేసింది మంచు ఫ్యామిలీ. తాజాగా ఆ వివాదం మరింత ముదిరింది. మంచు మనోజ్ ఒకవైపు, తన కుటుంబమంతా ఒకవైపుగా నిలబడింది. దీంతో వారందరితో మనోజ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని మీడియా అంతా మోహన్ బాబు ఇంటి చుట్టూ చేరింది. అదే సమయంలో అసహనం కోల్పోయిన మోహన్ బాబు (Mohan Babu).. ఒక మీడియా ఉద్యోగిని మైక్‌తో కొట్టడంతో ఆయనపై కేసు నమోదయ్యింది.
Also Read: రేవతి మృతిపై మెగా డాటర్ రియాక్షన్.. బన్నీ ఇప్పుడిప్పుడే మారుతున్నాడు
ముందడుగు వేశారు
జర్నలిస్ట్‌ను మైక్‌తో కొట్టిన కారణంగా మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ కేసు నమోదు అయ్యిందని, తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఇన్నాళ్లు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మధ్యలో ఒకసారి బయటికి వచ్చి తన వల్ల గాయాలయిన జర్నలిస్ట్‌ను కలిశారు. ఆ తర్వాత మళ్లీ అసలు ఆయన ఏమైపోయారో, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయనను అరెస్ట్ చేద్దామని మధ్యలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కూడా లాభం లేకపోయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అజ్ఞాతం నుండి బయటికి వచ్చారు మోహన్ బాబు. దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. తన సొంత స్కూల్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం కోసం మోహన్ బాబు ముందడుగు వేశారు.
స్కూల్ కోసం
రంగంపేటలోని విద్యానికేతన్ స్కూల్‌లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో మోహన్ బాబు పాల్గొన్నారు. ఇప్పటివరకు అసలు ఏమైపోయాడో కూడా తెలియనివ్వకుండా ఉన్న మోహన్ బాబు మొత్తానికి అజ్ఞాతం నుండి బయటికి వచ్చారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇంట్లో జరిగిన రచ్చ తర్వాత విష్ణు, మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ మోహన్ బాబు మాత్రం మనోజ్‌దే తప్పు అన్నట్టుగా రెండుసార్లు వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. మొత్తానికి ఈ కుటుంబ వివాదం ఇంకా తేలలేదు.
సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు…
👉రంగంపేటలోని విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు
👉మీడియాపై దాడి కేసులో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉండి తాజాగా వేడుకల్లో ప్రత్యక్షం
For More Updates Download The App Now – https://t.co/GvJeTp41mk pic.twitter.com/NK0UVO52qc— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2025