Sharwanand Movies : ఇవాళ (మార్చి 6)న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand) 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్న శర్వానంద్, ఇటీవల తండ్రిగా కూడా మారాడు. వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ, ఆయన సినీ కెరీర్ అనుకున్నంత లేదు. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చి హీరోగ ఎదిగాడు. తన గ్లామర్ ను ప్రేక్షకులు ఆదరించేలా మంచి సినిమాలు తీశాడు. ఓ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో దగ్గరయ్యాడు. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా విజయాలను అందుకోలేక నిరాశలో ఉన్నారు శర్వానంద్. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి, తర్వాత ఓ మంచి హిట్ లేకుండా పోయింది.
తర్వాత వచ్చిన రాధా సినిమా నుంచి మొదలుగొని మనమే వరకు శర్వా బ్యాక్ గ్రౌండ్ లో ఓ మంచి హిట్ లేకుండా పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అతని సినిమా వైపు మొగ్గు చూపడం లేదు. గత ఏడాది శర్వానంద్ నటించిన’మనమే’ (Manamey) సినిమా ఒకటే విడుదలైంది. ఈ చిత్రం సైతం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో కూడా స్ట్రీమ్ కాలేదు. అయితే, మార్చి 7 నుండి అమెజాన్ ప్రైమ్(amazon prime) వీడియో లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ఫ్యాన్స్‌కు ఇది శర్వా నుంచి బర్త్ డే గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో శర్వానంద్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం శర్వానంద్ మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి, అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతాయని సమాచారం.
1. శర్వా 36వ చిత్రం – యువీ క్రియేషన్స్(uv creations) నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నారు. 1990ల కాలంలో జరిగే కథతో వస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
2. శర్వా 37వ చిత్రం – రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘నారీ నారీ నడుమ మురారీ’. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు.
3. శర్వా 38వ చిత్రం – సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఈ కొత్త సినిమాలు శర్వాను విజయపథంలోకి తెస్తాయేమో చూడాలి! కాగా, ఇకనైనా శర్వానంద్ మంచి స్క్రిప్ట్స్ తో రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా పలువురు నటులు, నిర్మాతలు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.