SRH Match Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ షెడ్యూల్ ని బిసిసిఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 18వ సీజన్ లోని మొదటి మ్యాచ్ మార్చ్ 22న కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతోంది. ఇక ఈ ఐపీఎల్ లోని మొత్తం మ్యాచులు 13 నగరాల్లో 10 జట్ల మధ్య 74 మ్యాచులు జరుగుతాయి.
Also Read: Mohammed Shami: వివాదంలో షమీ… రంజాన్ ఉపవాస వేళ డ్రింక్స్ తాగడం పై ముస్లింలు ఆగ్రహం ?
వీటిలో ప్లే ఆఫ్ మ్యాచ్ లు కూడా ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లు మార్చి 22 నుండి మే 18 వరకు జరుగుతాయి. ఇక ఐపీఎల్ 2025 టైటిల్ వేటను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. గత సంవత్సరం అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ కీ చేరిన హైదరాబాద్ జట్టు.. చివరి మెట్టుపై బోల్తా పడింది.
కానీ ఈసారి అలాంటి తప్పు చేయకూడదనే పట్టుదలతో ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఈసారి హైదరాబాద్ వేదికగా 7 లీగ్ దశ మ్యాచ్ లతోపాటు.. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ఈ 18 సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ చేరితే.. ఏడు కంటే ఎక్కువ మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా ఆడనుంది.
ఇక హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ ల తేదీల వివరాలను చూస్తే.. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో, మార్చ్ 27న లక్నో సూపర్ జెయింట్స్ తో, ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్ తో, ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ తో, ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్ తో, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్ తో, మే 10న కలకత్తా నైట్ రైడర్స్ తో.. ఉప్పల్ వేదికగా తలపడుతుంది హైదరాబాద్ జట్టు. అయితే ఈ సీజన్ లో హైదరాబాద్ తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో మార్చ్ 23న ఆడబోతోంది.
అలాగే మార్చి 27న లక్నోతో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్ లకి సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ తన ఎక్స్ {ట్విట్టర్} ఓ ఆఫర్ నీ ప్రకటించింది. ఈ మ్యాచ్ లకు సంబంధించి రెండు టికెట్లను కొనుగోలు చేస్తే ఒక ఒక సన్రైజర్స్ హైదరాబాద్ జెర్సీని ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు మార్చ్ 7 గురువారం రోజున ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కావడంతో స్టేడియం భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియంలో ప్రేక్షకులతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్ మోహన్ రావు.
Orange Army, it’s time! 🧡
Tickets for our first two home games go live 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 at 11 AM on @lifeindistrict
Buy 2 tickets and get 1 jersey FREE!#PlayWithFire pic.twitter.com/0LsUCatBoo
— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025