SLBC Tunnel Rescue Operation: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో అధికారులు ప్లాన్- డీ అమలు చేస్తున్నారు. 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఎనిమిది మంది ఆచూకీ లభించకపోవడంతో.. రెస్క్యూ టీమ్స్ ప్లాన్ – డీ తో రంగంలోకి దిగాయి.
టన్నెల్ లోనికి క్యాడవార్ డాగ్స్..
కేరళ నుంచి తీసుకువచ్చిన రెండు క్యాడవర్ డాగ్స్ ను టన్నెల్ లోపలకి పంపి ఎనిమిది మంది కార్మికుల ఆచూకీని గుర్తించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ విజ్ఝప్తితో కేరళ ప్రభుత్వం రెండు క్యాడవర్ డాగ్స్ ను శ్రీశైలం టన్నెల్ ప్రాంతానికి పంపింది. ఈ రెండు క్యాడవర్ డాగ్స్ ను ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపలికి పంపించి కార్మికుల జాడను గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. వాసనను కనిపెట్టడంతో ఈ డాగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. మృతదేహాలను కూడా గుర్తించండంతో ఈ డాగ్స్ స్పెషల్ ట్రైనింగ్ పొందాయి. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో జరిగన బీభీత్సం అయిన ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను, గాయాల పాలైన బాధిత వ్యక్తులను ఈ క్యాడవర్ డాగ్స్ సింపుల్ గా గుర్తించాయి. ఈ క్రమంలోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోని ఇప్పటి వరకు దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీని గుర్తించేందుకు ఈ క్యాడవార్ డాగ్స్ తీసుకొచ్చారు. రేపు ఉదయం క్యాడవార్ డాగ్స్ ను ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపలికి అధికారులు పంపనున్నారు.
13 రోజులుగా నిర్వీరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ గత 13 రోజుల నుంచి నిర్వీరామంగా కొనసాగుతోంది. రాడార్ డేటా ఆధారంగా ఎనిమది ప్రాంతాలను గుర్తించిన రెస్క్యూ టీంస్ ఆయా ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించాయి. ఇప్పటికే నాలుగు చోట్ల తవ్వకాలు పూర్తి అయ్యాయి. మిగిలిన నాలుగు ప్రాంతాల్లో డ్రిల్లింగ్ కొనసాగుతోంది. అయితే తవ్వే కొద్ది పెద్ద ఎత్తున నీరు ఉప్పొంగి వస్తుండడంతో డీవాటరింగ్ సిస్టెమ్ ద్వారా అధకారులు నీటిని బయటకు పంపుతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పైన కూడా బురద భారీగా పేరుకుపోయింది. దీంతో బురదను బయటకు తీస్తున్నారు. బురదను, నీటి తొలగించి డెస్టినేషన్ పాయింట్ వద్దకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ALSO READ: SECR Recruitment: టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. పూర్తి వివరాలివే..
14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం..
మరోవైపు కన్వేయర్ బెల్ట్ మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరగగా.. కన్వేయర్ బెల్ట్ 13.5 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. 14 కిలోమీటర్లు వరకు కన్వేయర్ బెల్ట్ పని చేస్తే రెస్క్యూ సులభంగా పూర్తి చేయవచ్చు. కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు పంపే ఛాన్స్ ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ దిశా నిర్దేశం చేస్తున్నారు.