Shazahn Padamsee: రామ్ చరణ్ (Ram Charan), జెనీలియా(Genelia ) జంటగా వచ్చిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ గా నిలిచినా.. ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఇందులో మరో హీరోయిన్ గా నటించిన షాజన్ పదమ్సీ (Shazahn Padamsee).. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ప్రత్యేకించి రూబా పాత్రలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక తర్వాత తెలుగులో రామ్ (Ram Pothineni), వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో వచ్చిన ‘మసాలా’ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా ఈమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఘనంగా ఈమె వివాహం చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహం ఘనంగా జరగగా.. ఇక్కడ అందరూ ఈ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు అటు బాలీవుడ్ లో కూడా హీరోయిన్ షాజన్ పదమ్సీ తన ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే అటు హీరో ఇటు హీరోయిన్ ఇద్దరు తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు.
షాజన్ పదమ్సీ భర్త బ్యాక్ గ్రౌండ్..
ఇక పెళ్ళికొడుకు బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. మూవీ మ్యాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా (Ashish Kanakia)తో ఈమె ఏడడుగులు వేసింది. ఈయన ఒక ఫ్రెండ్ ద్వారా షాజన్ కి పరిచయమయ్యారట. అలా కొన్నాళ్లపాటు స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఇదే ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ జంట.. ఇప్పుడు అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో మూడు ముళ్ళు, ఏడడుగులతో ఒక్కటయ్యారు.
గత రెండు మూడు రోజుల నుండి హల్దీ, సంగీత్ కార్యక్రమాలతో సందడి చేసిన ఈ జంట.. ఇక జూన్ 5న అంటే గురువారం రాత్రి వీరి వివాహం జరిగింది. జూన్ 7న అనగా రేపు రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షాజన్ తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది.
షాజన్ పదమ్సీ కెరియర్..
షాజన్ పదమ్సీ కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. 2009 లో వచ్చిన ‘రాకెట్ సింగ్’ అనే బాలీవుడ్ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత ఆరెంజ్, కనిమొళి, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్ వంటి చిత్రాలలో నటించింది. సినిమాలే కాదు.. సూపర్ ధమాల్ వంటి షో లు కూడా చేసింది. ఇక ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా నటనకు స్వస్తి పలుకుతుందేమో అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మంచి పాత్ర దొరికితే, తాను చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తుందని, ఒక వర్గం అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి షాజన్ వివాహం తర్వాత మళ్లీ ముఖానికి రంగు పులుముకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే షాజన్ పెళ్లి జరిగిందని తెలిసి అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:Rana Daggubati: ఫొటోగ్రాఫర్‌పై రానా ఆగ్రహం.. అక్కడి జరిగింది ఇదేనంటూ వివరణ