Rana Daggubati: సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలైనా.. హీరోయిన్లైనా ఒక స్థాయికి చేరుకున్నారు అంటే వారి కష్టంతోపాటు అభిమానుల ఆదరణ కూడా ఉంటుంది. అయితే అది మరిచిపోయి హీరోలు అప్పుడప్పుడు అసహనానికి గురై అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలా అభిమానులపై అసహనం చూపిస్తే..చివరికి ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చాలామంది హీరోలు, హీరోయిన్లు బయట అభిమానులు కనిపిస్తే వారితో కాస్త సహనంగానే మాట్లాడి పంపిస్తూ ఉంటారు. ఇక అభిమానుల సంగతి కాస్త పక్కన పెడితే.. మీడియా, ఫోటోగ్రాఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు.. వెంటనే వారి వెంటపడి మరీ ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటివల్ల అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా (Daggubati Rana) కూడా ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్ పై అసహనం చూపించడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫోటోగ్రాఫర్ పై రానా అసహనం..
అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ముంబయి విమానాశ్రయం వద్ద నటుడు రానా ఫొటోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం చూపించారు. ఇక ఆ ఫోటోగ్రాఫర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో రానా అక్కడ ఒక మహిళకు తగిలడంతో.. తన ఫోన్ కింద పడిపోయింది. తన ఫోన్ పడిపోవడంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన రానా.. మళ్లీ తేరుకొని సున్నితంగా అతడిని మందలించారు. వాస్తవానికి ఎప్పుడు శాంతంగా ఉండే రానా ఇలా అసహనంగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
also read:Ritu Varma: గాయపడ్డ రీతూ వర్మ.. ఫోటో వైరల్!
అసలు విషయం చెప్పిన రానా..
ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ కావడంతో రానా ఈ విషయంపై స్పందించారు. తనకు ఇలాంటి పాప్ కల్చర్ నచ్చదని, ఇది టాలీవుడ్ లో లేదని కూడా వివరించారు. హైదరాబాదులో సినీ ప్రముఖులు ఎక్కువగా తమ ఇళ్లలోనే పార్టీలు నిర్వహిస్తారని, నగరం విస్తరించి ఉండటంతో సాధారణంగా ఫోటోగ్రాఫర్లు కూడా కనిపించరని, అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని కూడా రానా తెలిపారు. ఇక అందుకే ఆ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసే ప్రయత్నం చేయడంతో తప్పించుకునే ప్రయత్నం చేశానని, ఆ సమయంలోనే సడన్గా ఒక మహిళకి తగలడం జరిగిందని.. పైగా టాలీవుడ్‌లో కొంచెం ప్రైవసీ ఉందని.. ఒక మీడియా సంస్థతో చెప్పుకొచ్చారు రానా దగ్గుబాటి. ప్రస్తుతం రానా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
అనుమతి లేకుండా ఫొటోలు తీయడంపై రానా ఆగ్రహం
ముంబయి విమానాశ్రయం వద్ద నటుడు రానా ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిన ఓ ఫొటోగ్రాఫర్. తన ఫోన్ పడిపోవడంతో సున్నితంగా అతడిని మందలించిన రానా.
టాలీవుడ్‌లో కొంచెం ప్రైవసీ ఉందని ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించిన రానా. pic.twitter.com/N2Pheo9Qro— ChotaNews App (@ChotaNewsApp) June 6, 2025