Pawan Kalyan: ప్రస్తుతం సినిమాల మీద పవన్ కళ్యాణ్ కు ఆసక్తి తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలను చాలా సీరియస్ గా తీసుకున్న రోజుల్లో, ఒక సినిమా మీద ఎక్కువ కేర్ తీసుకునేవారు. ముఖ్యంగా ఏ తెలుగు హీరో చేయని విధంగా తన సినిమాలో దేశభక్తి పాటలు ఉండాలి అని అప్పట్లో ఎంట్రీ సాంగ్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ కొన్ని సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ పాటల్లో ఫిలాసఫీ కాకుండా ఎలివేషన్ ఎక్కువైపోయింది. తాను దర్శకత్వం వహించిన జానీ సినిమా మొదటి పాట ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమ్ముడు సినిమాలో ఒక ఇంగ్లీష్ పాటను పెట్టి ఇన్స్పైర్ చేయడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెల్లింది. అలానే సినిమాకు సంబంధించి చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు.
సూర్యతో గొడవ
దర్శకుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా పవన్ కళ్యాణ్ తో చేశాడు. ఈ సినిమా మొదట తమిళ్ లో విజయ్ జ్యోతిక హీరో హీరోయిన్ గా నటించారు. ఖుషి సినిమా తమిళ్లో ఎంట్రీ సాంగ్ లో జ్యోతికకు ఒక ప్రత్యేకమైన పాట ఉంటుంది. అయితే తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ లేడీస్ తో కలిసి డాన్స్ చేసే విధంగా ఒక పాటను పెడదామని ఎస్ జె సూర్య అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోకుండా ఒక దేశభక్తి పాట పెడదాం అంటూ చెప్పుకొచ్చారు. దీని గురించి వీళ్లిద్దరి మధ్య చాలా వాగ్వాదం జరిగింది. ఆల్మోస్ట్ ఇద్దరు గొడవపడే స్థితికి వెళ్లిపోయారు అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఖుషి మొదటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.
వరుస సినిమాలతో బిజీ
ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడంతో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రిలీజ్ అయిన రెండు రీమేక్ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఇక ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే సినిమాను చేస్తున్నారు కళ్యాణ్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడం. ఒక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రెండింటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా జరుగుతుంది.