BigTV English

OTT Movie : గతం మరిచిపోయే పోలీస్ … ఊహకందని ట్విస్ట్ లతో మర్డర్ ఇన్వెస్టిగేషన్ .. మెంటలెక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : గతం మరిచిపోయే పోలీస్ … ఊహకందని ట్విస్ట్ లతో మర్డర్ ఇన్వెస్టిగేషన్ .. మెంటలెక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలతో సినిమాలు చాలానే వస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఇటువంటి సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రీసెంట్ గానే థియేటర్లలోకి వచ్చింది. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘దేవా’ (Deva). 2025 లో విడుదలైన ఈ సినిమా కు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. మలయాళంలో 2013 లో విడుదలైన ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాను చగా రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పావైల్ గులాటి, ప్రవేశ్ రాణా ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక డైనమిక్ పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

దేవ్ (షాహిద్ కపూర్) ఒక తెలివైన, తిరుగుబాటు మనస్తత్వం కలిగిన పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తుంటాడు. అతను ఒక హై ప్రొఫైల్ హత్య కేసును దర్యాప్తు చేస్తుండగా, ఒక రోడ్డు ప్రమాదంలో అతని జ్ఞాపకశక్తి కోల్పోతాడు. ఈ ప్రమాదం తర్వాత, అతను తన సోదరి భర్త డిప్యూటీ కమిషనర్ అయిన ఫర్హాన్ సహాయంతో, కేసును మళ్లీ దర్యాప్తు చేయవలసి వస్తుంది. దీయా (పూజా హెగ్డే) అనే జర్నలిస్ట్ కూడా అతనికి సహాయం చేస్తుంది.
దర్యాప్తు సాగుతున్న కొద్దీ, దేవ్ ఒక కుట్రలో చిక్కుకుంటాడు. అతను తన గత దర్యాప్తు నుండి కొత్త సాక్ష్యాలను కనిపెడతాడు. అయితే గతంలో చేసిన దర్యాప్తు కి, ఇప్పుడు కనిపెట్టిన సాక్షాలకి పొంతన ఉండదు. డ్యూటీలో మరణించిన తన తండ్రికి సంబంధించిన భావోద్వేగ సమస్యలను అతను ఎదుర్కొంటాడు. దేవ్ దూకుడు స్వభావం దర్యాప్తుకు మరిన్ని సమస్యలు తెస్తుంది. చివరకు ఈ స్టోరీ ఒక షాకింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడ దేవ్ స్నేహితుడే, తన శత్రువు కోసం పనిచేస్తున్నాడని తెలుసుకుంటాడు. చివరికి దేవ్ ఈ కేసులో నేరస్తులను పట్టుకుంటాడా ? అతడు ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? అతని తండ్రి ఎలా చనిపోతాడు ? దీయా అతనికి ఏ విధంగా సహాయం చేస్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : పెళ్ళంటే పారిపోయే అమ్మాయి … మస్ట్ వాచ్ మలయాళం రొమాంటిక్ ఎంటర్టైనర్

Related News

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : వెంటాడే చెట్టు శాపం… ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసే పువ్వులు… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

Big Stories

×