Shine Tom Chacko arrested:ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacho) ఈరోజు ఉదయం 10 గంటలకు తన లాయర్ తో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందట. ఈ నేపథ్యంలోనే షైన్ టామ్ చాకో ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల క్రితం కొచ్చిలోని ఒక హోటల్లో పోలీసులు డ్రగ్స్ రైడ్ నిర్వహించగా.. కొన్ని నిమిషాల ముందే ఆ హోటల్ మూడవ అంతస్తు నుండి రెండవ అంతస్తులోకి దూకి, అక్కడి నుండి స్విమ్మింగ్ పూల్ లోకి.. అక్కడినుండి షైన్ టామ్ చాకో పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇతడిని విచారణకు పిలిచారు.ఈరోజు విచారణకు హాజరైన ఈయనను ఆధారాలతో సహా అరెస్టు చేయడం జరిగింది.
ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు..
ఇదిలా ఉండగా.. షైన్ టామ్ చాకో పై ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు మలయాళ నటి విన్సీ కూడా డ్రగ్స్ తీసుకొని షూటింగ్ సెట్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఏకంగా AMMA లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇతడి పై AMMA కమిటీ కూడా వేసింది. ఇక ఇప్పుడు హోటల్ నుండి డ్రగ్స్ రైడ్ లో భాగంగా పరార్ అయినట్లు ఆధారాలతో సహా ప్రూవ్ అయ్యాయి. దీంతో విచారణకు హాజరవ్వగా డ్రగ్ తీసుకున్నట్లు సాక్షాలతో సహా బయటపడడంతో ఆయనను అరెస్టు చేశారు . ఏది ఏమైనా ఇప్పుడు మలయాళం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం చాలా సంచలనంగా మారింది.
షైన్ టామ్ చాకో సినిమా కెరియర్..
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో దాదాపు 9 సంవత్సరాల పాటు డైరెక్టర్ కమల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఆ తర్వాత ‘ఖద్దమా’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టారు. అదుతా కాలతూ, చాప్టర్స్, మసాలా రిపబ్లిక్ వంటి అనేక చిత్రాలలో సహాయ పాత్రలు పోషించిన ఈయన 2014లో వచ్చిన ‘ఇతిహాస’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక 2023లో ‘దసరా’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈయన, ఇందులో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రంగబలి, దేవర సినిమాలతో పాటు, రాబిన్ హుడ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. అంతేకాదు బీస్ట్ , కురుప్, భీష్మ పర్వం వంటి తమిళ్ చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకున్నారుఅలా తెలుగు, తమిళ్, మలయాళం భాషా చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన..
. ఇప్పుడు ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Ajith: మరోసారి యాక్సిడెంట్ కి గురైన అజిత్.. టెన్షన్లో అభిమానులు..!