Diabetic retinopathy: డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కంటి చూపు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు కంటి సమస్యలు ఎదురవడం చాలా సాధారణం. ఈ సమస్యలు కేవలం అనారోగ్యకరంగానే కాకుండా, కంటి చూపును పూర్తిగా కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ పనితీరు సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతయట. ఫలితంగా కళ్లపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారు సరిగా చికిత్స చేసుకోకపోతే, కంటి నరాలు, రక్తనాళాలు, రెటినా వంటివి దెబ్బతినే ప్రమాదం ఉందట. దీని వల్ల కంటి చూపు మందగించిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
డయాబెటిస్ వల్ల కళ్లకు హాని..?
డయాబెటిస్ ఉన్న వారిరి కంటి ఆపరేటింగ్ భాగం రెటినా నరాల్లో రక్త ప్రసరణ ఇబ్బందులు ఏర్పడతాయి. దీని వల్ల ఆ భాగంలో నరాలు సరిగా పని చేయకపోవడం, దెబ్బతినడం, లేదా
కొత్త రక్తనాళాలు ఏర్పడటం జరుగుతుంది. ఇది చివరకు చూపును కోల్పోయేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ వల్ల రెటినాలోని మాక్యులాలో మచ్చలు వచ్చే ఛాన్స్ ఉందట. దీని వల్ల కంటి చూపు స్పష్టంగా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా అని పిలుస్తారట.
డయాబెటిస్ ఉన్న వారిలో క్యాటరాక్ట్ పెరుగుతుందట. దని వల్ల కళ్లు పొడిబారిపోతాయి. దాంతో చూపు మందగించిపోతుందట.
డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో గ్లోకోమా ప్రమాదం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కంటి అంతర్గత ఒత్తిడి పెంచడం వల్ల కంటి నరాలు దెబ్బతింటాయట.
కొంతకాలంగా జరిగిన కొన్ని అధ్యయనాలు డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు చాలా పెరిగిపోతున్నాయని చెబుతున్నాయి. 10 నుండి 15 సంవత్సరాల పాటు డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడిన వారి రెటినాల్లో ఉన్న మార్పులపై గమనించారు. డయాబెటిస్‌కు కంటి నరాలను దెబ్బతీసే శక్తి ఉందని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకకుండా దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
డయాబెటిస్ నివారణలో ప్రాథమిక నియమాలు పాటిస్తే కంటి సమస్యలు చాలా వరకు తగ్గించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్‌లోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, వ్యాయామం చేయడం, క్రమంగా భోజనం తీసుకోవడం వల్ల ఈ సమస్యలను కొంతవరకైనా తగ్గించగలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు
ఇప్పటికే డయాబెటిస్ ఉన్న వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని అంటున్నారు. దీంతో పాటు ప్రతి 6 నెలలకోసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి, కంటి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం చాలా అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.