BigTV English

Shine Tom Chacko: జనవరిలో నిశ్చితార్థం.. ఆగస్టులో బ్రేకప్.. దసరా విలన్ వింత ప్రేమాయణం

Shine Tom Chacko: జనవరిలో నిశ్చితార్థం.. ఆగస్టులో బ్రేకప్.. దసరా విలన్ వింత ప్రేమాయణం

Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో దసరా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం చాకోకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత రంగబలి సినిమాలో కూడా విలన్ గా మెప్పించాడు. ప్రస్తుతం దేవర సినిమాలో చాకో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


దేవర సినిమాలో చాకో నటిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఇతగాడి గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక మలయాళంలో ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసి అభిమానులకు మతులు పోయాయి. యాంకర్ తో పులిహోర కలపడం, ఫోన్లు విసిరేయడం, విచ్చలవిడిగా రోడ్డు మీదనే తాగడం.. ఇలాంటివన్నీ చూసి చాకో క్యారెక్టర్ భలే తేడాగా ఉందే అని నవ్వుకున్నారు. చాకో ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చాకో జనవరిలో మోడల్ తనూజతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. 40 ఏళ్ల వయస్సులో అతడు ప్రియురాలితో నిశ్చితార్థం జరుపుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇది చాకోకు రెండో వివాహం. మొదటి భార్యతో విడాకులు అయ్యి సింగిల్ గా ఉంటున్న అతడి లైఫ్ లోకి తనూజ వచ్చింది.


కొన్నేళ్లు ప్రేమాయణం నడిపిన ఈ జంట ఈ ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకొని తమ బంధాన్ని అధికారికంగా తెలిపారు. ఇక త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తారేమో అని ఎదురుచూస్తున్న తరుణంలో తమ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని చెప్పి షాక్ ఇచ్చాడు.

తాజాగా తన ఎంగేజ్ మెంట్ పిక్స్ ను చాకో ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాడు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో తాను మళ్లీ సింగిల్ అని చెప్పుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా చాకో, తనూజ మధ్య విబేధాలు తలెత్తాయని, దీంతో తనూజ సైతం ఈ పెళ్లిని వద్దనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×