BigTV English

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌.. హాకీలో బ్రిటన్‌పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌.. హాకీలో బ్రిటన్‌పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌

India Beat Great Britain Enter hockey Semi Finals: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్ హాకీ జట్టు సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌పై విజయం సాధించింది. బ్రిటన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో టై అయింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్‌లో భారత్ సత్తా చాటింది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది.


రెండో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే భానత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై కావావలనే కొట్టిన్లు భావించిన రిఫరీలు ఆయనను రెడ్ కార్డ్ ద్వారా బయటకు పంపించేశారు. దీంతో భారత్..10 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అయినప్పటికీ భారత్ పట్టు కోల్పోకుండా చివరి వరకు బ్రిటన్ గట్టిపోటీ ఇచ్చింది.

భారత్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాడు. దీంతో భారత్ ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. తర్వాత రెండు క్వార్టర్స్‌లో రెండు జట్లు గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది.


Also Read: మోసం గురూ.. మన బాక్సర్ మెడల్ నొక్కేశారు!

షూటౌట్‌లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌కు చేరి రికార్డు సృష్టించింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×