BigTV English

Amaran Trailer: అప్పుడు మేజర్ సందీప్.. ఇప్పుడు మేజర్ ముకుంద్.. అదిరిపోయిన ట్రైలర్

Amaran Trailer: అప్పుడు మేజర్ సందీప్.. ఇప్పుడు మేజర్ ముకుంద్.. అదిరిపోయిన ట్రైలర్

Amaran Trailer:  ఎన్ని జనరేషన్స్  మారినా..  దేశభక్తి ఎప్పటికీ మారదు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆర్మీ అధికారుల మీద ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. అందుకే  దేశం కోసం ప్రాణాలు అర్పించిన  ఏ అధికారి బయోపిక్ వచ్చినా కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్  జీవిత కథ ఆధారంగా 2022 లో   మేజర్ అనే సినిమా వచ్చింది. అడివి శేష్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఇప్పుడు మరో ఆర్మీ ఆఫీసర్ జీవిత కథతో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామాన్ని ఉగ్రవాదుల నుండి తొలగించడానికి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా యాంటీ-టెర్రరిస్ట్ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ 25 ఏప్రిల్ 2014న ఆయన ప్రాణాలను అర్పించారు.

Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట తీవ్ర విషాదం..


ఇక ఆ తరువాత  మేజర్ ముకుంద్ కు అశోక చక్ర బిరుదును అందించారు. ఆయన జీవిత కథతో తెరకెక్కుతున్న అమరన్ సినిమాలోమేజర్ ముకుంద్ గా శివకార్తికేయన్ నటిస్తుండగా.. ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటిస్తుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా.. కమల్ హాసన్ తన బయనే లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా అమరన్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముకుంద్ ఒరిజినల్ వీడియోతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముకుంద్ కాలేజ్ డేస్, ప్రేమ, పెళ్లి, ఆర్మీకి వెళ్లడం, అక్కడ టెర్రరిస్టుల ఎటాక్ అన్ని ట్రైలర్ లో చూపించారు. ముకుంద్- ఇందుల  లవ్ స్టోరీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. కాలేజ్ లో జూనియర్ అయిన ఇందును.. ముకుంద్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కులాలు వేరైనా.. ఆర్మీ ఆఫీసర్ అని తెల్సినా.. ఇందు అతడినే పెళ్లి చేసుకుంటుంది. ఇప్పటికీ ఆమె ముకుంద్ ను తలుచుకుంటూనే ఉంది.

దీపావళి స్పెషల్ లుక్స్.. బర్త్ డే బ్యూటీ మలైకా అరోరాను చూసి ఇన్‌స్పైర్ అవ్వండి!

ఆర్మీకి వెళ్లడం కుటుంబానికి ఇష్టంలేకపోయినా.. దేశం మీద ప్రేమతో ముకుంద్ చేసిన త్యాగం.. ఎంతోమంది కుటుంబాలను కాపాడింది. ఇక జీవీ ప్రకాష్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చారు.  ఇక ఈ మధ్య వెట్టయాన్ తెలుగు టైటిల్ కాంట్రవర్సీ ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమిళ్ సినిమాలు తెలుగులో అవే పేరుతో రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు. అమరన్ కూడా ఇదే సమస్య వచ్చింది. తెలుగులో వేరే టైటిల్ పెట్టి ఉంటే బావుంటుందని వార్తలు వినిపించాయి. కానీ, మేకర్స్ అమరన్ టైటిల్ నే పెట్టాలని మంకు పట్టు పట్టినట్లు తెలుస్తోంది. అదే పేరుతో ఈ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి  విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×