Shiva Raj Kumar.. ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) ఈమధ్య దక్షిణాది భాషా సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో అతిధి పాత్రలు కూడా పోషిస్తూ సౌత్ ఆడియన్స్ కి దగ్గరవుతున్న ఈయన ఒకవైపు హీరోగా, మరొకవైపు విలన్ గా కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే శివరాజ్ కుమార్ కి ఇటీవలే ఫ్లోరిడాలోని మియామీ క్యాన్సర్ హాస్పిటల్ లో సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఇప్పుడిప్పుడే ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. మరొకవైపు వచ్చే నెల అనగా జనవరి 25వ తేదీ లోపు ఇండియాకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. కానీ ఇంతలోపే ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది.
శివన్న ఇంట్లో విషాదం..
అసలు విషయంలోకి వెళ్తే.. శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ కన్ను మూసింది. ఈ విషయాన్ని ఆయన సతీమణి గీతా శివరాజ్ కుమార్ (Geetha Shiva Raj Kumar) సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. గీత శివ రాజు కుమార్ షేర్ చేసిన ఈ నోట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా శివ రాజ్ కుమార్ అభిమానులు సైతం నిట్టూరుస్తున్నారు.
సుదీర్ఘ నోట్ వదిలిన గీత శివరాజ్ కుమార్..
ఇక అందులో ఏముందనే విషయానికి వస్తే.. “మా ఇంట్లో మేము ఐదుగురు సభ్యులం కాదు. మొత్తం ఆరుగురుం. శివన్న, నేను, నిషు, నివి, దిలీప్ ఇంకా నీమో (పెట్ డాగ్). దిలీప్.. నిషు పుట్టినరోజు సందర్భంగా నీమోను బహుమతిగా ఇచ్చాడు. అయితే నిషు డాక్టర్ కావడం వల్ల ఆమె దానిని చూసుకునే అంత టైం కూడా లేదు. అందుకే మేము వాడి బాగోగులు చూసుకోవడం ప్రారంభించాము. దాంతో వాడు కూడా మా కుటుంబంలో ఆరవ వ్యక్తి అయ్యాడు. సాధారణంగా ఎవరైనా తమ పెంపుడు కుక్క వెంట పరిగెత్తుతారు. కానీ మా నీమో మాత్రం మా వెనకే ఉండేవాడు. మేము ఇంట్లో ఎక్కడికి వెళ్లినా.. ముఖ్యంగా నేను కిచెన్లో ఉన్నా, గార్డెన్ లో ఉన్నా నా వెనకాలే ఉండేవాడు. నేను, నీమో ఇద్దరం కాదు.. మేమిద్దరం ఒక్కటే. అసలు నేనే కాదు నా కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నీమోతో మంచి అనుబంధం ఉంది. అందుకే మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నీమోని కుటుంబ సభ్యుడిలాగే చూసుకున్నారు. మేము ఎప్పుడూ కూడా మాతోనే ఉంటుంది” అంటూ తన పెట్ డాగ్ గురించి ఎమోషనల్ అవుతూ సుదీర్ఘ నోటు వదిలింది గీత శివరాజ్ కుమార్. అంతే కాదు తన పెట్ డాగ్ ఫోటోని కూడా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన చాలామంది శివన్న ఇంటికి రాకనే పెట్ డాగ్ చనిపోయింది. అసలు ఏమైంది? అది చనిపోవడానికి గల కారణం ఏంటి? అనే విషయాలు ఆరా తీస్తున్నారు.