Siva Raj kumar RC 16 Look : ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’తో తన అభిమానులను థియేటర్లలో పలకరించాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఎలాగైనా సరే మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని రామ్ చరణ్ కసితో చేస్తున్న మూవీ ‘ఆర్సి 16’ (RC16). ఈ పాన్ ఇండియా మూవీకి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు మేకర్స్. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఆయన లుక్ టెస్ట్ పూర్తయ్యింది అంటూ నిర్మాతలు ఓ వీడియో ద్వారా అప్డేట్ ఇచ్చారు.
‘ఆర్సీ 16’ కోసం శివన్న స్టన్నింగ్ లుక్
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వికపూర్ జంటగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘ఆర్సి 16’. ఈ పాన్ ఇండియా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బయోగ్రఫీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ‘మీర్జా పూర్’ ఫేం దివ్యేందు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కి ముందే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
కానీ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ కోసం మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాలోని కీలక సన్నివేశాలను శర వేగంగా రెగ్యులర్ షూటింగ్లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం గత ఏడాదే శివరాజ్ కుమార్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఆయన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ ఉండటం వల్ల, సెట్ లోకి ఇంకా అడుగు పెట్టలేదు. తాజాగా క్యాన్సర్ నుంచి ఆయన కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శివన్నను స్టన్నింగ్ లుక్ లోకి మార్చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. తాజాగా శివన్నకు సంబంధించిన టెస్ట్ లుక్ పూర్తయింది, త్వరలోనే ఆయన సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కానీ అందులో శివన్న లుక్ ను సస్పెన్స్ లో పెట్టారు. దీంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నారు? శివరాజ్ కుమార్ పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
‘ఆర్సీ 16’ షూటింగ్ అప్డేట్
డిసెంబర్లో శివరాజ్ కుమార్ కి క్యాన్సర్ కి సంబంధించిన సర్జరీ జరగగా, అప్పటినుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కెమెరా ముందుకు రావడానికి శివన్న ఎట్టకేలకు రెడీ కాగా, ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి మొదలు కాబోతోందని సమాచారం. రామ్ చరణ్ శివన్న లపై కీలక సన్నివేశాలను హైదరాబాద్లోనే చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది చిత్రబృందం. అలాగే ఢిల్లీలోని జమా మసీదులో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. రంజాన్ మాసం కారణంగా ఈ షెడ్యూల్ మార్చ్ చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.