Sivaji Raja : సినీ నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమృతం సీరియల్ లో నటించిన ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శివాజీ రాజా బుల్లితెర కార్యక్రమాలతో పాటు.. అటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఈయన సినిమాలు చేస్తూ పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్పారో చూద్దాం..
బండ్ల గణేష్ పై శివాజీ కామెంట్స్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో శివాజీ రాజా మాట్లాడుతూ.. తన సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా మనం ఒకరిని చూసినప్పుడు వారి స్వభావం ఇది అని అంచనా వేస్తాము అలా బండ్ల గణేష్ ని చూస్తే వాడు ఒక తుత్తర కాండిడేట్ అని శివాజీ రాజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. ఆయన మాట్లాడుతూ.. బండ్ల గణేష్ నాకన్నా చిన్న వాడు.. గని అని పిలిస్తే మాతో అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో బండ్ల గణేష్ ఎక్కువ పిచ్చి పనులు చేసేవాడు తన పనుల కంటే పక్కవారి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవారు. ప్రతిదీ తనకే కావాలని అనుకొనేవాడు.. అదే కొన్ని సార్లు అతనికి తేడా కొట్టేది అని శివాజీ రాజా అంటున్నారు.
Also Read : కార్గిల్ యుద్ధంలో పోరాడిన బాలీవుడ్ హీరో.. గ్రేట్ కదా..
ఆ ఒక్కటి ఉంటే చాలు..
బండ్ల గణేష్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అలాగే అమ్మాయిల కోసం ఎంతకైన వెళ్ళేవాడు. అమ్మాయిలు ఉంటే అసలు సమయం కనపడదని అమ్మాయిలతోనే ఎక్కువ సమయం కేటాయించేవాడు అంటూ బండ్ల గణేష్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఒకరోజు నేను శ్రీకాంత్ బయటకు వెళ్లి తాగి వచ్చాము ఆ విషయం నాన్నకు చెప్పి మమ్మల్ని బాగా కొట్టించాడు. ఆ తర్వాత వాడిని లోపలికి తీసుకెళ్లి బాగా చితకబాదామని అన్నారు. ఇక ఒకరోజు తను చేసిన మంచి పని తెలిసి తనపై అభిప్రాయం మారిపోయిందని తెలిపారు.ఒక నేపాలి అమ్మాయిని దత్తత తీసుకొని మంచి మనసు చాటుకున్నాడు. ఆ పాప కోసం బండ్ల గణేష్ ఎన్నో త్యాగాలు చేశాడు.. అదే అతనికి మంచి పేరు తెచ్చింది. ఇక ఎవరు ఎలా పోయిన పట్టించుకోడు.. తనని ఆప్యాయంగా పిలిస్తే వారికోసం ఏమైనా చేస్తాడు అని శివాజీ రాజా అన్నారు.. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో.. ఆయన కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉంటాడు. కొన్ని తప్పులు చేసినా కూడా బండ్ల మనసు చాలా మంచిదని శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..