BigTV English
Advertisement

A.R.Rahman: ఆస్కార్ గ్రహీతకు షాక్.. కాపీ కొట్టాడంటూ కేసు.. 2 కోట్లు ఫైన్ వేసిన హైకోర్టు..!

A.R.Rahman: ఆస్కార్ గ్రహీతకు షాక్.. కాపీ కొట్టాడంటూ కేసు.. 2 కోట్లు ఫైన్ వేసిన హైకోర్టు..!

A.R.Rahman: ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) కు తాజాగా ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన సంగీతం అందించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని ఒక పాటకు కాపీరైట్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేస్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దారుడికి రూ.2కోట్లు ఇవ్వాలని ఏ.ఆర్.రెహమాన్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను కూడా ఆదేశించింది. అటు మణిరత్నం(Maniratnam ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ ఇప్పుడు కాపీ రైట్ అంటూ చిక్కుల్లో పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఆయన కాపీ కొట్టడం ఏంటి? అంటూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


కాపీ కొట్టారంటూ ఆరోపణలు..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ 1,2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక రెండవ భాగంలో విక్రమ్ , కార్తీక్ , త్రిష, రవి మోహన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రెండు సినిమాలకి కూడా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇకపోతే పొన్నియిన్ సెల్వన్ -2 సినిమాలోని “వీరా రాజా వీరా” అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన ‘శివ స్తుతి’ పాట నుంచి కాపీ చేసినట్లు సింగర్ ఉస్తాదు ఫయాజ్ వసిఫుదీన్ డగర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన తరువాత.. శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడగా.. ఇప్పుడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లు పిటిషన్ దారుడికి అందించాలని ఆదేశాలు జారీ చేసింది.


ఏఆర్ రెహమాన్ కెరియర్..

భారతీయ సంగీత దర్శకుడుగా, స్వరకర్త ,గీత రచయిత, గాయకుడు, నిర్మాత, సంగీత కళాకారుడు కూడా.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి సమకూర్చిన సంగీతంతో మంచి పేరు లభించింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఈయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు రెండుసార్లు ఆస్కార్ అవార్డులు కూడా లభించాయి. ముఖ్యంగా రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడు కూడా ఈయనే కావడం గమనార్హం. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదిక పైకి తీసుకెళ్లిన ఘనత రెహమాన్ కే దక్కింది. ఇక జాతీయస్థాయిలో నాలుగు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలింఫేర్ అవార్డులను ప్రభుత్వ ఆవార్డులను అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా స్వీకరించారు. ఇంకా అలాంటి ఈయనపై ఇప్పుడు కాపీ రైట్ ఆరోపణలు రావడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×