Nindu Noorella Saavasam Serial Today Episode : తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడిని పట్టుకోవాలని బాబ్జీతో కలసి ప్లాన్ చేస్తుంది మనోహరి. అయితే చిత్రే ఇదంతా చేస్తుందేమోనని అనుమానంగా చిత్రకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. దీంతో చిత్ర హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్తూ.. మనోహరికి తన మీద డౌట్ వచ్చిందనుకుని మనోహరితో మాట్లాడుతూనే మరో ఫోన్ నుంచి కాల్ చేస్తుంది. దీంతో మనోహరి చిత్ర మళ్లీ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. మరో కాల్ లిఫ్ట్ చేస్తుంది. చిత్ర గొంతు మార్చి మాట్లాడుతుంది. నేను అడిగింది ఏం చేశావు అంటుంది. దీంతో మనోహరి నువ్వు చెప్పిన చోటికి వచ్చాను డబ్బు ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది. దీంతో చిత్ర అక్కడ ఉన్న డస్ట్ బిన్‌లో పెట్టి వెళ్లిపో అని చెప్తుంది. సరేనని కాల్ కట్ చేసి బాబ్జీ నేను అక్కడ డస్ట్ బిన్‌లో డబ్బులు పెట్టి వెళ్లిపోతాను. నువ్వు ఇక్కడే ఒక దగ్గర పేపర్ చదువుతూ ఏమీ తెలియనట్టు కూర్చొని వాడెవడో చూడు అని చెప్తుంది.
దీంతో బాబ్జీ సరే మేడం అంటాడు. ఇవాళ్టీతో వాడి పని ముగించేద్దాం అంటూ మనోహరి ఆలోచిస్తుంది. బాబ్జీ వెళ్లి దూరంగా ఉన్న బెంచీ మీద పడుకుని పేపర్ చదువుతున్నట్టు ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన చిత్ర ప్లాన్ ప్రొసీడ్ అని మనోహరికి మెసేజ్ చేస్తుంది. మనోహరి వెళ్లి డబ్బులు పెట్టి వెళ్లిపోతుంది. చిత్ర అక్కడకు రావడం చూసిన బాబ్జీ ఆశ్చర్యపోతాడు. దేవుడా నా కోసమే ఈ అమ్మాయిని ఇక్కడకు పంపావా..? వస్తున్నా బంగారం వచ్చేస్తున్నా అంటూ పరుగెత్తుకుని చిత్ర దగ్గరకు వెళ్తాడు. హలో మేడం అని పిలవగానే బాబ్జీని చూసిన చిత్ర వీడేంటి ఇక్కడ అనుకుంటుంది. దగ్గరకు వెళ్లిన బాబ్జీ హలో అండి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. దీంతో చిత్ర మిమ్మల్ని లోకేషన్ అడిగాను కదా చూడటానికి వచ్చాను. ఇదిగో ఈ టిన్ డస్ట్‌బిన్ లో పడేద్దామని వెళ్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు. సరే గానీ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చిత్ర అడగ్గానే.. నేను కూడా లోకేషన్ చూడ్డానికే వచ్చాను అని బాబ్జీ చెప్తాడు. లోకేషన్ చాలా బాగుంది కదండి అంటుంది చిత్ర.
బాబ్జీ కూడా అవును సూపర్ గా ఉంది అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో చిత్తు కాగితాలు ఏరుకునే వాడు వెళ్లి మనోహరి అక్కడ పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. అది చూసిన చిత్ర మీకు ఇక్కడ ఏం పని లేదా అని అడుగుతుంది. బాబ్జీ నాకు ఏం పని లేదండి.. మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడగ్గానే ఏమీ వద్దులే నాకు పనుంది వెళ్తాను అంటూ చిత్ర వెళ్లిపోతుంది. బాబ్జీ డస్ట్ బిన్ దగ్గర డబ్బులు లేకపోవడం చూసి షాకింగ్ అవుతాడు. పరుగెత్తుకెళ్లి అంతా సర్చ్ చేస్తాడు. మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి ఏయ్ వాడెవడో తెలిసిందా ..? పట్టుకున్నావా..? అని అడుగుతుంది. దీంతో లేదు మేడం నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే.. వాడెవడో వచ్చి డబ్బులు పట్టుకెళ్లాడు అని చెప్తాడు బాబ్జీ. మనోహరి కోపంగా ఏయ్ అమ్మాయి ఎవర్రా..? అని అడుగుతుంది.
దీంతో అదే మేడం నాకు హోటల్ లో పరిచయం అయింది అని చెప్పాను కదా ఆ అమ్మాయి. నేను చెప్పిన లోకేషన్ చూడ్డానికి వచ్చింది అని బాబ్జీ చెప్పగానే.. మనోహరి కోపంగా రేయ్ బుర్ర తక్కువ వెధవ నేను చెప్పిన పని ఏంటి..?నువ్వు చేసిన పనేంటి..? బ్లాక్ మెయిల్ చేస్తున్న వాణ్ని పట్టుకోరా అంటే అమ్మాయితో మాట్లాడుతూ కూర్చున్నావా..? అంటుంది. దీంతో బాబ్జీ సారీ మేడం వాడు ఎక్కువ దూరం వెళ్లి ఉండడు.. ఇక్కడున్న అందరినీ చెక్ చేస్తా..? ఎవడో కనిపెడతా అంటడు. దీంతో మనోహరి చేసిన ఘనకార్యం చాలు వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దాన్ని చంపడానికి అన్ని రెడీ చేసుకో అని చెప్తుంది. బాబ్జీ అలాగే మేడం అంటూ కాల్ కట్ చేస్తాడు. అనవసరంగా ఐదు లక్షలు బొక్క అని మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. మరోవైపు చెత్త ఏరుకునే వాడి దగ్గరకు వెళ్లి వాడు తీసుకొచ్చిన ఐదు లక్షలు తీసుకుంటుంది చిత్ర.
తర్వాత పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటుంటే పై నుంచి చూస్తుంది మనోహరి. అమర్ ఎలాగూ ఇంట్లో లేడు. ఇప్పుడు పిల్లలకు ఏమైనా జరిగితే భాగీ మీద అటాక్ ఈజీగా చేయోచ్చు అనుకుంటుంది. కిందకు వచ్చి పిల్లలతో కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఆడిస్తుంది మనోహరి. అంజుకు గంతలు కట్టి పక్కనే ఉన్న లోయలో పడేలా చేయాలనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?