Nani : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని బ్యాగ్రౌండ్ గురించి అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నాడు. న్యాచురల్ స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. నాని సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తుంటారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు నానికి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే విశ్వక్ సేన్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. నాని ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
విశ్వక్ సేన్ తో గొడవల పై నాని క్లారిటీ..
స్టార్ హీరో నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. సమ్మర్ స్పెషల్ గా మే 1న భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన రెండు పార్ట్స్ మంచి సక్సెస్ సాధించాయి. అందుకే మూడో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాని పాన్ ఇండియా వైడ్ గా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని విశ్వక్ తో గొడవల పై క్లారిటీ ఇచ్చేశాడు.
హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసారు. అయితే హిట్ 2 లో విశ్వక్ ని కాకుండా అడివి శేష్ ని లీడ్ రోల్ లో తీసుకొచ్చారు. మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ ను పెట్టి, రెండో పార్ట్ లో విశ్వక్ని కాకుండా అడవి శేషును తీసుకురావడానికి కారణం నాని, విశ్వక్ మధ్య గొడవలే అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు పై నాని క్లారిటీ ఇచ్చాడు.. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. విశ్వక్ కాదనడంతోనే శేష్ దగ్గరకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. ఇదొక సిరీస్ లాగా కాకుండా యూనివర్సల్ లాగా తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ నేను రాలేను అని అటువైపు నుంచి సమాధానం రావడంతోనే వేరే హీరోని తీసుకురావడం జరిగిందని నాని చెప్పాడు. అంతేగాని మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.. ప్రస్తుతం మీ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఈ రూమర్స్ చెక్ పెట్టేసినట్లు అయ్యింది.
Also Read :సింగర్ ప్రవస్తి మనసులో ఇంత ఉందా..? అప్పుడే మొత్తం ఆపేస్తుందా..?
హిందీలో మార్కెట్ కోసం నాని ప్రయత్నిస్తున్నాడా..?
ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో నానికి హిందీలో మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అడగ్గా నాని సీరియస్ అయ్యాడు. నేను నా సినిమాని హిందీలోకి తీసుకెళ్లాలని,హిందీలో మార్కెట్ ని పెంచుకోవాలని అనుకోలేదు.. నేను ఎక్కడ లొకేషన్స్ కి వెళ్ళినా కొంతమంది హిందీలో కూడా మీ సినిమాలు వస్తే బాగుంటాయని అనడంతోనే అక్కడ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నాను అని అన్నాడు. మార్కెట్ ని పెంచుకోవాలనుకుంటే నేను నా సినిమాని మల్టీప్లెక్స్ లలోని రిలీజ్ చేసే వాడిని.. కానీ నా సినిమాని ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ లలో మాత్రమే రిలీజ్ చేస్తున్నానని అన్నాడు. అందుకని నా సినిమాలో హిందీలో కూడా ఉన్నాయి నన్ను అభిమానించే వాళ్ళు అక్కడ కూడా మీరు చూడొచ్చు అని చెప్పడానికి మాత్రమే సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తున్నానని నాని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో నానిపై ఆయన ఫ్యాన్సు ప్రశంసలు కురిపిస్తున్నారు. మే 1న రాబోతున్న హిట్ 3 మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..