Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కొత్త సమస్యలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయనపై ఇప్పటికే కేసు నమోదు కాగా, ఈ రోజు, రేపు అరెస్ట్ కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే… ఈ డిజిటల్ యుగంలో ఫోన్ లేకపోతే ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది అందరికీ. అందులోనూ స్మార్ట్ ఫోన్ ఉండి తీరాల్సిందే. టెక్నాలజీ వల్ల కొంత నష్టం ఉంటే, మరికొంత వరకు లాభాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచం డిజిటల్ గా రోజుకో కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తోంది. కానీ విచిత్రంగా పోసాని (Posani Krishna Murali) మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి పోయినట్టుగా కనిపిస్తున్నారు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఒక సాధారణ ఫోన్ వాడుతున్నట్టుగా తెలిసింది. పోసాని కృష్ణ మురళి ఇంటర్నెట్ లేని ఒక పాత నోకియా కీప్యాడ్ ఫోన్ ని వాడడం ఆసక్తికరంగా మారింది.
మరో విచిత్రమైన వార్త ఏమిటంటే ఆయనకి అసలు వాట్సప్ అంటే ఏంటో తెలియదట. అంతేకాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటి గురించి అసలు ఐడియానే లేదట. మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడడం, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అంటూ ఫోన్లకి అతుక్కుపోతున్నారు. ఇలా ఈ డిజిటల్ యుగంలో కూడా పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) మాత్రం వెరైటీగా నోకియా ఫోన్ వాడడమే కాకుండా టెక్నాలజీకి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. ఇన్నేళ్లలో ఆయన ఫోన్లో ఫోటోలు కూడా తీయలేదట. ఒకసారి తీయడానికి ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదని చెప్పారాయన. మరి టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నటుడు అయిన పోసాని దగ్గర ఏ ఐఫోన్ లేదా కాస్ట్ లీ ఫోన్ ఉంటుందేమో అనుకున్న వారికి ఈ వార్త తెలిసి షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు రాష్ట్ర యువత ప్రతినిధి బండారు వంశీ కృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు. మరోవైపు పోసాని మాత్రం తాను కేసులకు భయపడి పారిపోయే వ్యక్తిని కాదని అన్నారు. అలాగే రీసెంట్ ఇంటర్వ్యూలో గతంలో తను చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యామిలీ లను కొందరు టార్గెట్ చేసినప్పుడు, తాను ఖండించాను అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. మరి పోసాని విషయంలో సిఐడి ఏం తెలుస్తుందో చూడాలి.