BigTV English

Rainbow : రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ.. షూటింగ్ షురూ..

Rainbow : రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ.. షూటింగ్ షురూ..

Rainbow : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా మంచి జోష్ మీదుంది. పుష్ప సినిమాతో అమ్మడు పాన్ ఇండియా కథానాయికగా ఎదిగిపోయింది. ఆ మూవీలో సాంగ్స్ కు ఆమె చేసిన డాన్స్ కుర్రకారును ఉర్రూతలూగించింది. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.


ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి వారసుడు సినిమాలో నటించింది. ప్రస్తుతం గ్లామర్ డాల్ గా మెరుస్తున్న రష్మిక ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో డాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు ఓ సరికొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది రష్మిక. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో అలరించిన ఈ నటి ఇప్పుడు ‘రెయిన్‌ బో’ అనే లేడి ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇలాంటి పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. రెయిన్‌ బో మూవీ కచ్చితంగా సినీ అభిమానులను అలరిస్తుందని పేర్కొంది. ఇది ఓ క్రేజీ రైడ్‌లా ఉంటుందని రష్మిక వివరించింది.

డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్‌ తెలుగులో రెండో ప్రాజెక్టుగా ‘రెయిన్‌ బో’ మూవీని నిర్మిస్తోంది. ఇది పక్కా లేడీ ఓరియంటెడ్‌ సినిమా. ఈ చిత్రంతో శాంతరూబన్‌ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. రొమాంటిక్‌ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తున్నారు.


రెయిన్ బో మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసింది. 2021లో సమంత పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టను రష్మిక హీరోయిన్‌గా స్టార్ట్ చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×