Daaku Maharaj:తాజాగా సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ (Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaj)మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. నందమూరి అభిమానులు ఎన్నో రోజుల నుండి బాలకృష్ణ నుండి ఇలాంటి సినిమా రావాలని కోరుకుంటున్నారు. అలా అభిమానుల పల్స్ పట్టేసిన బాలకృష్ణ ఫాన్స్ కి ఏదైతే నచ్చుతుందో అలాంటి జానర్లోనే సినిమాతో వచ్చేసారు. బాలకృష్ణ అంటే అభిమానులకు ఎక్కువగా గుర్తుకు వచ్చేవి డైలాగులు, యాక్షన్స్ సన్నివేషాలు, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ కూడా డాకు మహారాజ్ మూవీలో ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అన్నీ కూడా ఆయా అభిమానుల హీరోలకు మాత్రమే బాగా నచ్చుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా డాకు మహారాజ్ మూవీ లో నటించిన హీరోయిన్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రద్ధా శ్రీనాథ్..
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు..శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Shrinath)..బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా పర్వాలేదనిపించుకున్నప్పటికీ.. శ్రద్ధా శ్రీనాథ్ కి మాత్రం పాన్ ఇండియా మూవీలో అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ శ్రద్ధా శ్రీనాథ్ కి ఏ సినిమాలో అవకాశం వచ్చిందిదో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా సినిమా విడుదలై హిట్ అయితే కచ్చితంగా ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు, కమెడియన్లకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అందులో నటించిన నటుల పెర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం అవకాశాలు లభిస్తాయి. అలాగే డాకు మహారాజ్ లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కి కూడా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
జైలర్ -2లో అవకాశం..
ఇక శ్రద్ధా శ్రీనాథ్ కి రజినీకాంత్ (Rajinikanth ) హీరోగా చేస్తున్న ‘జైలర్ -2’లో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ 2023లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.అయితే దీనికి సీక్వెల్ గా జైలర్ 2 కూడా ఉంటుందని మూవీ మేకర్స్ చెప్పారు. అయితే ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ తో కూలీ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, శివ కార్తికేయన్ వంటి హీరోలు కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కూలీ మూవీ షూటింగ్ అయిపోయి విడుదలైన తర్వాత.. నెక్స్ట్ రజినీకాంత్ జైలర్-2 మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక బాలయ్య డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ నటనకి మంచి మార్కులు పడడంతో జైలర్-2 లో ఈమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్..
ఇక జైలర్-2 మూవీ మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.అలాగే జైలర్ పార్ట్ 1 లో నటించిన రమ్యకృష్ణ, తమన్నా, యోగి బాబు వంటి ఆర్టిస్టులు కూడా జైలర్ -2 లో భాగమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక శ్రద్ధా శ్రీనాథ్ జైలర్ -2 సినిమాలో మాత్రమే కాకుండా మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. ప్రేమకు తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయోమో చూడాలి.