Bumrah vs Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ( Border-Gavaskar Trophy ) భారత్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ( Rohit Sharma ) అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సిడ్ని టెస్ట్ కు పూర్తిగా దూరమయ్యాడు. రోహిత్ టెస్ట్ భవిష్యత్తు గురించి టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆలోచనలో పడింది. ఒకవేళ రోహిత్ టెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తే అతని స్థానంలో ఓపెనర్ గా ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ చేసి ఆకట్టుకున్నారు.
సిరీస్ లో చూసుకుంటే రాహుల్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ రోహిత్ స్థానంలో రాహుల్ ని ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ కు అనుభవం, ప్రతిభ ఉన్నాయి. దీంతో రాహుల్ ఎంపిక సరైనదేనని అంటున్నారు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా పరుగులు చేస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమాన్యు ఈశ్వరన్ కూడా రోహిత్ స్థానంపై కన్నేశాడు. అభిమన్యు దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. సెలెక్టర్లు అతనిపై విశ్వాసంతో ఉన్నారు. ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ దేశవాలి క్రికెట్ లో 101 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. అందులో 48.87 సగటుతో 7,674 పరుగులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అతని పేరు మీద 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.
ALSO READ: Uthappa on Virat Kohli: అంబటి రాయుడును తొక్కేసింది కోహ్లీనే..2019 లో ఇదే జరిగింది !
ఇక ఎమ్మెస్ ధోని ( MS Dhoni) సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) తరపున ఆడుతూ తనదైన ముద్ర వేసుకుంటున్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఋతురాజ్ గైక్వాడ్ ( Rituraj Gaikwad ) కూడా ఉన్నాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా చెన్నై కెప్టెన్సీని అప్పగించింది. దేశవాలి క్రికెట్ లో గైక్వాడ్ పరుగుల వరద బారిస్తున్నాడు. సాంకేతికంగా గైక్వాడ్ చాలా బలంగా కనిపిస్తాడు. 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 41.52 సగటుతో 2535 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 7 సెంచరీలు, 13 అర్థ సెంచరీలు చేశాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా రాణిస్తుండడంతో గైక్వాడ్ కి అవకాశాలు కల్పిస్తే టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ ( Rohit Sharma ) స్థానం ఖాళీ అయితే గైక్వాడ్ పేరు కూడా పరిశీలనలోకి వస్తుంది. ఇక అభిమన్యులాగే గుజరాత్ కి చెందిన ప్రియాంక్ పంచల్ కూడా చాలా సంవత్సరాలుగా దేశవాలి క్రికెట్ లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ చాలాసార్లు జట్టులోకి వచ్చారు. కానీ అరంగేట్రం చేయలేకపోయాడు.
ఇంగ్లాండ్ లో అతని అరంగేట్రం కన్ఫామ్ అవుతుందని చాలామంది భావించారు. కానీ అది జరగలేదు. దేశవాళి క్రికెట్ లోనూ అతని రికార్డ్ బలంగానే ఉంది. 125 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో 44.75 సగటుతో 8683 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీమ్ ఇండియా భవిష్యత్తుగా భావిస్తున్న శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. యశస్వి జట్టులోకి వచ్చిన అనంతరం గిల్ నెంబర్-3కి పరిమితమయ్యాడు. రోహిత్ ( Rohit Sharma ) అవుట్ అయినట్లయితే గిల్ ఓపెనింగ్ కోసం పోటీపడి అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్ గా గిల్ రికార్డులు బాగున్నాయి. అయితే గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా కొనసాగించాలని అనుకుంటున్నారు. అంటే ఓపెనింగ్ కోసం.. గిల్, రాహుల్ మధ్య పోటీ నెలకొంది. ఇక అటు టెస్ట్ కెప్టెన్సీ బుమ్రాకు కాకుండా.. జైస్వాల్ ఇస్తారని అంటున్నారు. దీంతో బుమ్రా తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. కానీ గంభీర్ మాత్రం… జైస్వాల్ కు ( Yashasvi Jaiswal) ఇవ్వాలని చెబుతున్నాడట.