BigTV English

Shruthi Haasan : మరో బాయ్ ఫ్రెండ్ వేటలో శృతి… కాబోయే వాడిలో ఈ లక్షణం ఉండాలట

Shruthi Haasan : మరో బాయ్ ఫ్రెండ్ వేటలో శృతి… కాబోయే వాడిలో ఈ లక్షణం ఉండాలట

Shruthi Haasan : పాన్ ఇండియా హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) తాజాగా మరోసారి బాయ్ ఫ్రెండ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంటున్నాను అని కొన్ని రోజుల క్రితమే చెప్పిన శృతి తనకు కాబోయే వాడిలా ఉండాల్సిన లక్షణాలు ఏంటో మరోసారి అభిమానుల ముందు ఉంచింది.


కావలసిన వాడిలో ఆ లక్షణాలు…

శృతి హాసన్ (Shruti Haasan) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన సినిమాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులు అడిగే ప్రశ్నలకు తరచుగా సమాధానాలు ఇస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలలో ఆమె చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అనే విషయాలను బయట పెట్టింది.


ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నకి శృతి హాసన్ (Shruti Haasan) సమాధానం ఇస్తూ తనకు కాబోయే వాడు ఆదర్శవంతమైన భాగస్వామి అయి వుండాలని చెప్పుకొచ్చింది. అతను తన పార్టనర్ తో సరదాగా ఉండాలని, జోక్స్ వేసి బాగా నవ్వించాలని, సృజనాత్మకంగా ఉంటూనే ఇతరుల్లో స్ఫూర్తి నింపే ఆలోచనలు కలిగి ఉండాలని లిస్టు మొత్తాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఇటీవల శృతిహాసన్ (Shruti Haasan) తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ‘మీరు సింగిలా రిలేషన్షిప్ లో ఉన్నారా?’ అని ప్రశ్నించగా, దానికి సమాధానంగా శృతి హాసన్ ‘ఇలాంటి ప్రశ్నలు నాకు నచ్చవు. అయినప్పటికీ చెబుతున్నాను నేను సింగిలే.. ఇప్పుడు రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ప్రస్తుతానికి పనిలో బిజీగా ఉన్నాను. లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ 

ఇక ఈ బ్యూటీ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట రీసెంట్ గా బ్రేకప్ చెప్పుకుని దూరమయ్యారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన శృతి హాసన్ (Shruti Haasan) అతనితో బ్రేకప్ గురించి వెల్లడిస్తూ ‘ఈ ప్రయాణంలో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఇతరుల గురించి కూడా అర్థం చేసుకున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ఎక్కడా శాంతను హజారికా ప్రస్తావనను తీసుకురాలేదు శృతిహాసన్.

కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలి’ (Coolie) అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు ‘శౌర్యంగ పర్వం’లో కూడా భాగం కాబోతోంది. అయితే అడవి శేషుతో కలిసి ఆమె చేయాల్సిన ‘డెకాయిట్’ అనే సినిమాను పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×