Tirumala Summer Rush: వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. మే 14వ తేదీ నుంచి తిరుమల రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మే 30న ఒక్కరోజే 71,721 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 36,011 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలు రూ.3.42 కోట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్యలు చూస్తేనే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కడి వరకూ చేరిందో అర్థం అవుతోంది.
క్యూలైన్లు కష్టాలకే కేరాఫ్ అడ్రెస్
ఈ భారీ రద్దీ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శిలాతోరణం వద్ద భక్తులు నిరీక్షణలో ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా వచ్చేవారికి ప్రస్తుతం సగటున 18 గంటలు క్యూలో నడవాల్సి వస్తోంది. అయితే క్యూలైన్లలో బస, నీరు, తిండి వంటి సదుపాయాలను టీటీడీ కల్పిస్తున్నప్పటికీ భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ నిర్ణయాలపై విమర్శలు?
ఇదే సమయంలో టీటీడీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ పాలకమండలి సభ్యుల సూచన మేరకు గత 15 రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలు కేటాయించడంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల టీటీడీ ఛైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
సర్వదర్శనం… మధ్యాహ్నం 12 గంటలకు?
పురాణాలలో పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమలలో ఇప్పుడు సర్వదర్శనమే మధ్యాహ్నం తర్వాతే ప్రారంభమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి క్యూలో నిలబడి ఎదురుచూసే భక్తులకు ఇది తీవ్ర అసహనంగా మారుతోంది. దర్శనం వేళల్లో అనూహ్య మార్పుల వల్ల భక్తులు ఆశలు కోల్పోతున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పలువురు స్వయంగా తెలిపారు.
Also Read: AP New Ration Card: AP రేషన్ కార్డులో WIFE ఆప్షన్ ఎక్కడ? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి
తిరుమల దర్శనానికి ముందు తెలుసుకోవాల్సినవి
ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను ముందుగానే గుర్తుంచుకోవడం మంచిది. సర్వదర్శనం టోకెన్లు పొందే ప్రయత్నం చేయండి. లేకపోతే కనీసం 18 గంటల సమయం అవసరం. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు ముందే సిద్ధం చేసుకోండి. కానీ టీటీడీ కూడా అన్ని సౌకర్యాలు అందిస్తోంది. వృద్ధులు, పిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. TTD అధికారుల నుండి ధృవీకరించిన సమాచారమే నమ్మాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమైనవేనా కాదా అని పరిశీలించాలి.
సామాన్య భక్తుల కోపం..
సామాన్య భక్తుల పరిస్థితి పట్టించుకోరా? అని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ సేవలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, సేవలో కాదు, హడావుడిలో ఉంది టీటీడీ అని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల ఒకటి కాదు, లక్షల మందికి మనోబలానికి కేంద్రం. భక్తుల భావోద్వేగాలు ఎంతో విలువైనవి. టీటీడీ పాలకవర్గం ఈ విషయాన్ని గుర్తించి, సామాన్య భక్తులకు మరింత అనుకూలంగా సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురి అభిప్రాయం. రద్దీ సమయంలో దర్శన సమయాల్లో స్పష్టత, క్యూలైన్లలో మెరుగైన సదుపాయాలు తప్పనిసరి చేయాలని అంటుండగా, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సారథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉంటున్నాయని మరికొందరు భక్తులు అంటున్నారు. అయితే సమ్మర్ హాలిడేస్ ముగింపు సంధర్భంగా భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ పరిస్థితి ఎదురైందని టీటీడీ అధికారులు అంటున్నారు.
టీటీడీ వివరణ
నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో తిరుమల ఆల్వార్ ట్యాంక్ వద్ద సర్వదర్శనం క్యూ లైన్‌లో ఓ భక్తుడు టీటీడీ యాజమాన్యంపై “డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశాడు. క్యూలో నీరు, పాలు లేవని ఆరోపణలు చేస్తూ భక్తులను ఆందోళనకు గురిచేశాడు. అయితే, వాస్తవంగా దర్శన క్యూలైన్లలో ప్రతి వంద అడుగులకు టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
సదరు భక్తుడు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చి ఆరోగ్య సమస్యలను ఉద్దేశిస్తూ నిరసనకు పాల్పడ్డాడు. నినాదాలు చేస్తే త్వరగా దర్శనానికి అనుమతి ఇస్తారన్న ఉద్దేశంతోనే నేను అలా ప్రవర్తించాను అంటూ తన తప్పును ఒప్పుకొని టీటీడీ చైర్మన్, అధికారులకు క్షమాపణ కూడా చెప్పాడు. కాకినాడ రూరల్‌కు చెందిన భక్తుడు బి. అచ్చారావుగా తనను పరిచయం చేసుకున్నాడు. తాను చేసిన నిరసన తర్వాత కొద్దిదూరం వెళ్తూనే పాలు అందాయని తెలిపారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, అందుకే సమయం ఎక్కువైనట్లు ఆయన తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మరో వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, టీటీడీ విజిలెన్స్, పోలీసు బృందాలు అతన్ని గుర్తించి చర్యలు తీసేందుకు గాలింపు మొదలుపెట్టాయి. ఇటీవల టీటీడీను టార్గెట్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తుండటం గమనార్హం. తాజా ఘటనను కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు వాడుకుంటూ అసత్యంగా ప్రచారం చేశారని టీటీడీ పేర్కొంది. భక్తులలో గందరగోళం కలిగించేలా తప్పుడు సమాచారం పంచేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారికంగా హెచ్చరించింది.
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చేశారు. ‘‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్’’ అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భక్తులు నిరసన తెలిపారు. దీంతో… pic.twitter.com/ctCsNXxVoA
— ChotaNews App (@ChotaNewsApp) May 31, 2025