BigTV English

Siddharth Galla : మహేశ్ ఫ్యామిలీ నుండి మరో వారసుడు..

Siddharth Galla : మహేశ్ ఫ్యామిలీ నుండి మరో వారసుడు..
Siddharth Galla


Siddharth Galla : సినీ పరిశ్రమలో వారసులు అనేవారు సహజం. కానీ ఎంతపెద్ద స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారసుడు అయినా టాలెంట్ లేకపోతే సినీ పరిశ్రమలో ముందుకు వెళ్లడం కష్టం. దీని గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వారసుడిగా వచ్చి తండ్రిని మించిపోయిన తనయుడు అనిపించుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు ఫ్యామిలీ నుండి మరో వారసుడు సినీ డెబ్యూకు సిద్ధంగా ఉన్నాడు.

తెలుగులో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు మహేశ్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. హీరోగా మారి.. తన తండ్రికి అందిన సూపర్ స్టార్ బిరుదును తాను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే కృష్ణ ఆ కుటుంబం నుండి మహేశ్.. మరికొందరిని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. అందులో సుధీర్ బాబు, అశోక్ గల్లా లాంటి వారు ఉన్నారు. తాజాగా మరొకరు ఆ కుటుంబం నుండి డెబ్యూకు సిద్ధమయ్యాడు.


మహేశ్ తర్వాత హీరోలుగా పరిచయమయిన సుధీర్ బాబు.. తన స్టైల్‌లో స్టోరీలను సెలక్ట్ చేసుకుంటూ పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తన తర్వాత పరిచయమయిన అశోక్ గల్లా మాత్రం ఇంకా తన కెరీర్‌ను పూర్తిస్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అశోక్.. తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లాకు ఇద్దరు కుమారులు. అందులో ఒకడు అశోక్ గల్లా.. ఇప్పటికే ‘హీరో’ అనే సినిమాతో డెబ్యూ చేశాడు. మరొకడు సిద్ధార్థ్ గల్లా కూడా హీరోగా పరిచయం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అశోక్ లాగానే సిద్ధార్థ్ కూడా చూడడానికి అందంగా, హీరోలాగా ఉంటాడు. అంతే కాకుండా హీరోగా మారడం కోసం యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. రాఘవేంద్ర రావు చేత సిద్ధార్థ్ గల్లాను హీరోగా లాంచ్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమాకు స్క్రిప్ట్ ఇప్పటికే ఓకే కాగా.. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్‌గా శ్రీలీలాను తీసుకుంటే సినిమాకు హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×