
BJP news in telangana(Political news today telangana): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. బీజేపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే తన తమ్ముడు పార్టీలోకి తిరిగొస్తారంటూ వెంకట్‌రెడ్డి సైతం లీకులు ఇస్తున్నారు. ఫాంహౌజ్‌లో పొంగులేటి, జూపల్లిలో చర్చలంటూ గుసగుసలు వినిపించాయ్. అలర్ట్ అయిన అధిష్టానం.. ఇటీవల రాజగోపాల్‌రెడ్డిని, ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి పంపించింది. కట్ చేస్తే.. ఈటలకు కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు కట్టబెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఏకంగా బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్టు తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. ఇలా.. అలకపూనిన ఇద్దరు బడా నేతలకు.. పదవులతో పట్టం కట్టి సంతృప్తి పరిచింది.
తాజా పదవులతో వాళ్లిద్దరూ ఫుల్ హ్యాపీ. కానీ, ప్రాధాన్యత ఉన్న పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం ఫుల్ అన్‌హ్యాపీ. పదేళ్లుగా అందరికంటే ఎక్కువగా పని చేస్తున్నా.. తనకేం తక్కువ? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కానీ, అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కానీ, లేదంటే జాతీయ అధికార ప్రతినిధిగా కానీ.. నియమించాలంటూ పట్టుబట్టారు. ఢిల్లీ వెళ్లి గట్టిగానే ప్రయత్నించారు. ఆ మూడిట్లో ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ సందర్భంలో బీజేపీ నాయకత్వం తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలోనూ పడ్డారు. బహుషా.. రఘునందన్‌కు ఆయన అడిగిన ఏదో ఒక పోస్టు ఇచ్చే వారేమో. కానీ, ఈలోగా ఆయన నోరు జారడం.. ఏకంగా నడ్డాపైనే విమర్శలు చేయడంతో.. ఇక ఆయనకున్న అవకాశాలు హుష్‌కాకి అయ్యాయని తెలుస్తోంది. నిన్నగాక మొన్న వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిని చేసి.. తనను మాత్రం పట్టించుకోవట్లేదని లోలోన తెగ రగిలిపోతున్నారట రఘునందన్‌రావు. మరి, పార్టీని వీడే సాహసం చేస్తారా? బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్‌లోకి గాని వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా?