E-Paper
Advertisement

Tillu Square Collections : మోత మోగిస్తోన్న టిల్లుస్క్వేర్ కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంతంటే?

Tillu Square Collections : మోత మోగిస్తోన్న టిల్లుస్క్వేర్ కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంతంటే?
Advertisement
Tillu Square Collections
Tillu Square Collections

Tillu Square Collections: కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సీఫీసు వద్ద డిజాస్టర్‌గా మారుతుంటాయి. మరికొన్ని మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఎక్జాంపుల్ ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీకి వర్తిస్తుంది. ఎప్పుడో గత రెండు సంవత్సరాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది డీజే టిల్లు మూవీ.

ఆ సమయంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. కామెడీ టైమింగ్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కింది. ‘టిల్లు స్క్వేర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

Advertisement

ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అవడంతో సీక్వెల్‌పై ఫస్ట్ నుంచే పాజిటీవ్ రెస్పాన్స్ ఉంది. అందులోనూ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మరింత హైప్ ఏర్పడింది. దీంతో సినిమా రిలీజ్ అవ్వగానే సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇందులో కూడా కామెడీ టైమింగ్‌తో పాటు రొమాన్స్‌ను యాడ్ చేశారు. దీంతో సినిమాపై రెస్పాన్స్ మరో స్థాయికి చేరుకుంది.

Also Read: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?.. వైరల్ అవుతున్న వీడియో

Advertisement

రెండు గంటల నిడివితో వచ్చి నాన్ స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో కడుపుబ్బా నవ్వించేసింది. ఇదే క్రమంలో థియేటర్లు వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక వసూళ్ల పరంగా ఈ మూవీ మోత మోగించేస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజునే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.23.7 కోట్లు వసూళు చేసింది. ఇక రెండో రోజు మొత్తం రూ.45.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది.

ఇక మూడో రోజుకు వచ్చేసరికి మరిన్ని వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లు టిల్లు స్క్వేర్ మూవీ రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరచింది. దీంతో అతి తొందర్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరబోతుందని ట్రెడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ స్టార్ బాయ్ సిద్దు హీరోగా నటించి అదరగొట్టేశాడు. అంతేకాకుండా అనుపమపరమేశ్వరన్ కూడా తన అందం, యాక్టింగ్, రొమాంటిక్ సీన్లతో యూత్‌ని కట్టిపడేసింది. మరెందుకు మీరు కూడా ఇంకా సినిమా చూసుండకపోతే వెంటనే చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×