BigTV English

Dhoni Wife Sakshi: మా ఆయనకి మ్యాచ్ ఓడిపోయినట్టు తెలీదనుకుంటా: సాక్షి ఫన్నీ పోస్ట్

Dhoni Wife Sakshi: మా ఆయనకి మ్యాచ్ ఓడిపోయినట్టు తెలీదనుకుంటా: సాక్షి ఫన్నీ పోస్ట్

Dhoni Wife Sakhi


IPL 2024 DC VS CSK Dhoni Wife Sakshi: ఎప్పుడూ క్రీజులో మిస్టర్ కూల్ గా ఉంటాడని ధోనీకి పేరుంది. అయితే తన సతీమణి సాక్షి కూడా ఎప్పుడూ బయటి ప్రపంచంలోకి రాదు. ఎందుకంటే తను పబ్లిక్ లోకి వస్తే వారి ప్రైవసీకి ప్రమాదం వస్తుంది. వారు ఫ్రీగా తిరగలేరు. జనం చుట్టూ మూగుతారు. ఎందుకంటే ధోనీ ఒక టాప్ సెలబ్రిటీ.. మరి అతని భార్యంటే కూడా క్రేజ్ ఉంటుంది కదా.. కానీ ఇటీవల కాలంలో చాలమంది క్రికెటర్ల సతీమణులు నెట్టింట సందడి చేస్తున్నారు.

ఈసారి ధోనీ సతీమణి సాక్షి చేసిన కామెంట్ అందరికీ నవ్వు తెప్పించాయి. ఎందుకంటే విశాఖ మ్యాచ్ లో చివర్లో వెళ్లిన ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తో టాప్ లేపాడు. 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మనవాడు ఆడుతుంటే అభిమానులు అందరూ ఆనాటి ధోనిని చూసినట్టుగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ సందర్భంగా ధోని ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్దు అందుకున్నాడు. అందులో తను ఫుల్ జోష్ తో ఆనందంగా నవ్వుతూ కనిపించాడు. దాంతో సాక్షి ఏం చేసిందంటే ఆ ఫొటోను షేర్ చేస్తూ…దాని కింద ఒక క్యాప్షన్ రాసింది. రిషబ్ పంత్ కి స్వాగతం.. అంటూనే బహుశా మ్యాచ్ ఓడిపోయినట్టు ధోనికి తెలీనట్టుంది. చాలా ఆనందంగా ఉన్నాడు. అని రాసుకొచ్చింది.
దీంతో నెట్టింట అందరూ కామెంట్లు మొదలెట్టారు. నిజమే.. ధోనీ చివర్లో వచ్చాడు. మ్యాచ్ ఓడిపోతుందని తెలిసి కూడా ఫటాఫట్ లాడించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా సంతోషంగా అందరికీ షేక్ హ్యాండ్ లు ఇస్తూ వెళ్లాడు. మేం కూడా అలాగే అనుకున్నామని సాక్షిగా వంత పాడటం మొదలుపెట్టారు. ధోనీని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు.
అదేం కాదు.. ఓడిపోతే పోయింది. కనీసం రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డాడు.. ఇది కదా.. కెప్టెన్సీ అంటే అని ధోనీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇక్కడ చెప్పుకోతగిన విషయం ఏమిటంటే ధోనీ ఆడుతున్నంతసేపు అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. మ్యాచ్ ఓడినా సరే, ధోని ఆనాటి ఆటను చూసి, గెలిచినంత సంబరపడ్డారు. ఇది చాలు, పోతే పోయిందిలే మ్యాచ్ అనుకున్నారు. బహుశా అదే కిక్కుతో ధోనీ కూడా స్టేజి ఎక్కి అవార్డు తీసుకున్నాడని కొందరంటున్నారు. మొత్తానికి సాక్షి ఫన్నీ కామెంట్లు ఇంత దూరం తీసుకువెళ్లాయని మరికొందరు సరదాగా అంటున్నారు.


Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×