Big Stories

Cocaine Capsules : కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. వాటి విలువ రూ.11 కోట్లు..

- Advertisement -

Cocaine Capsules in Stomach : విదేశాల నుంచి భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఎయిర్ పోర్టుల్లో అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేస్తున్న అధికారులకు.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. అదీ వారి లగేజీల్లోనో, చెప్పుల్లోనో కాదు.. కడుపులో. అక్షరాల 11 కోట్ల రూపాయల విలువైన కొకైన్ క్యాప్సూల్స్ ను కడుపులో పెట్టుకుని ముంబైకి వచ్చిన వ్యక్తిని డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

సియర్రా లియోన్ దేశానికి చెందిన అతని కడుపులో 1108 గ్రాముల బరువు ఉన్న డ్రగ్ క్యాప్సూల్స్ ను శనివారం ముంబై లోని జేజే ఆస్పత్రి వైద్యులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 28న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వద్ద డీఆర్ఐ బృందం సియెర్రా లియోన్ జాతీయుడిని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపింది. విచారణలో కొకైన్ ను తరలించేందుకే అతను డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించాడు.

కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం.. ఆపరేషన్ చేసి పొత్తి కడుపులో ఉన్న 74 కొకైన్ క్యాప్సూల్స్ ను తొలగించారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News