JACK Movie :ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu jonnalagadda) హీరోగా, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా రాబోతున్న చిత్రం “జాక్(Jack) .. కొంచెం క్రాక్ ” అనేది ఉప శీర్షిక. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి వినోదానికి ఏమాత్రం లోటు చేయకుండా థియేటర్లలో అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధం అయ్యాం అంటూ ఇటీవల సిద్దు జొన్నలగడ్డ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో భారీ సక్సెస్ అందుకొని ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని బలంగా ముందడుగు వేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ ముందు ఇప్పుడు భారీ టార్గెట్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ లెక్కలు, అలాగే ఎంత రీచ్ అయితే సిద్దు గట్టెక్కుతారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
జాక్ మూవీ బిజినెస్ లెక్కలు..
సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.20 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రాబట్టాలి అంటే రూ.21 కోట్లు సాధించాల్సి ఉంటుంది. మరి సిద్దు రూ.21 కోట్లు రాబడితే తప్ప గట్టెక్కే పరిస్థితులు కనబడడం లేదు. వాస్తవానికి సిద్దు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఇప్పటికే మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఈ బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రేపు విడుదల కాబోయే ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఈవెన్ రాబడుతుందో చూడాలి.