King Cobra on Bed| అనుకోకుండా ఒక పెద్ద విష సర్పం మీ మీదకు వచ్చేస్తే మీరేం చేస్తారు. మీ రియాక్షణ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. కుదిరితే తప్పించుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అయితే ఒక యువకుడ మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందించాడు. పెద్ద నాగుపాము తనపై వచ్చి కూర్చున్నా.. తాను నిద్రపోతున్న ప్రదేశంలో అటుఇటు తిరుగుతున్నా.. ఏమీ చేయకుండా ధైర్యంగా చూస్తూ ఉన్నాడు. పైగా దాన్ని తన ఫోన్ తో వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియో బాగా వైరల్ అవుతోంది.
కొన్ని వారాల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో మనుషులు ప్రమాదంలో ఎలా స్పందిస్తారనే చర్చను మళ్లీ రేకెత్తించింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు చూస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఒక ఇంట్లో తన బెడ్ రూంలో ఒక యువకుడు నిద్రపోతుండగా.. ఒక పొడువైన కింగ్ కోబ్రా అంటే పెద్ద నాగు పాము వచ్చింది. నేరుగా ఆ యువకుడి శరీరంపై వచ్చి కూర్చుంది. అప్పుడా ఆ యువకుడు భయం లేకుండా వీడియో తీస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఏ మాత్రం బెదరకుండా, కదలకుండా దాన్ని గమనిస్తూ ఉన్నాడు. పాము అతని దెగ్గరగా వచ్చినప్పుడు ఆ దృశ్యం చాలా ఉత్కంఠంగా, ప్రమాదకరంగా అనిపిస్తుంది.
ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. ప్రమాదంలో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఎప్పుడు శాంతంగా ఉండాలి, ఎప్పుడు వేగంగా స్పందించాలి అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకంటే అంతటి ప్రమాదకరమైన పాము సమీపంగా ఉన్న సమయంలో ఎవరైనా బెదిరిపోతారు. భయంతో ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఆ యువకుడు ఆ ప్రమాదకరమైన జీవిని కోపం తెప్పించకుండా శాంతంగా ఉన్నాడు.
ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగినట్లు చెబుతున్నారు, ఇక్కడ కింగ్ కోబ్రాలతో సహా అనేత విషపూరిత పాములు అధిక సంఖ్యలో ఉన్నాయి. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీశారు అనేది విషయంపై స్పష్టత లేదు. వీడియోలో కనిస్తున్న ఆ పాము అడవి నుండి వచ్చిందా లేక వేరే రకంగా వచ్చిందా అనే వివరాలు తెలియలేదు. ఈ పాము ఆ వ్యక్తి బెడ్‌రూమ్‌లోకి ఎలా వచ్చింది, అతను ఎందుకు అంత శాంతంగా ఉన్నాడు అనే ప్రశ్నలు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తించాయి. అందుకే ఈ వీడియోను వేల మంది లైక్ చేస్తున్నారు.
Also Read: పెళ్లికూతురిని కింద పడేసిన అతిథి.. చూస్తూ ఉండిపోయిన పెళ్లికొడుకు
నెటిజెన్లంతా ఆ వ్యక్తి ధైర్యాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు అతని పరిస్థితి హాస్యాస్పదంగా ఉందని ఫన్నీగా కామెంట్ చేశారు. మరికొందరు భారతదేశం ఆస్ట్రేలియా పాముల మధ్య తేడాను పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పాములు ఎక్కువ విషపూరితమైనవి అయినప్పటికీ, అవి సాధారణంగా మనుషులతో తక్కువగా తలపడతాయని, కానీ భారతదేశంలో ప్రజలు పాములతో ఎక్కువగా చెలగాటమాడుతారని ఒక యూజర్ రాశాడు. ఇంకొక యూజర్ అయితే.. పాము ఆ యువకుడిని గమనిస్తున్నట్లు అనిపించిందని, ఈ అనుభవం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారు.