Singer Chinmayi:ఫిలిం ఇండస్ట్రీలో వివాదాస్పద సింగర్ గా పేరు సొంతం చేసుకున్న చిన్మయి(Chinmayi).. ఒక సింగర్ మాత్రమే కాదు పలువురు స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. ముఖ్యంగా సమంత(Samantha )లాంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన చిన్మయి.. ఈమధ్య తరచూ వివాదాలలో తలదూరుస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసిన ఈమె.. ఆ తర్వాత కాలంలో మహిళలకు, చిన్న పిల్లలకు ఇటు సమాజంలో ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడి, తన గళం విప్పుతూ ఎదుటివారికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సింగర్ చిన్మయిపై కోలీవుడ్ లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. చాలా మంది దర్శక నిర్మాతలు ఈమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , సింగర్ గా అవకాశం ఇవ్వడం లేదు. కానీ తెలుగు, హిందీలో మాత్రం ఈమెకు అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. ఒకవైపు సింగర్ గా తన స్వరాన్ని వినిపిస్తూనే మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేస్తుంది.
చిన్మయిపై బ్యాన్ ఎత్తివేయాలంటూ డిమాండ్..
ఇకపోతే కోలీవుడ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈమెపై బ్యాన్ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఈమెతో పనిచేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా మణిరత్నం (Maniratnam ), కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ (Thuglife) సినిమాలో కూడా చిన్మయి పాట పాడింది. ఆ పాటను తమిళంలో సింగర్ ధీ (Singer Dhee) పాడగా.. తెలుగు, హిందీలో మాత్రం చిన్మయి పాడారు. అయితే ఇటీవల థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఆ ఈవెంట్ కి సింగర్ ధీ పలు కారణాలవల్ల హాజరు కాలేదు. దీంతో ఆ పాటను తమిళంలో కూడా చిన్మయి ఆలపించారు. అయితే తమిళంలో ఊహించకుండా సింగర్ ధీ పాడిన పాట కంటే చిన్నయి పాడిన పాటకే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. దీంతో ఇంత మంచి వాయిస్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం.. వెంటనే కోలీవుడ్లో ఆమె మీద ఉన్న బ్యాన్ తీసేయండి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇలా ఈమెపై బ్యాన్ ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ చిన్మయి స్పందించింది.
లీగల్ గా పోరాడుతాను.. కోర్టులోనే తేల్చుకుంటా – చిన్మయి
చిన్మయి మాట్లాడుతూ.. ” నామీద కోలీవుడ్లో బ్యాన్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నా మీద మాత్రమే కోలీవుడ్ సినీ పరిశ్రమ బ్యాన్ విధించలేదు ఇంకా చాలామంది మీద ఈ బ్యాన్ విధించింది. కాబట్టి వీటిపై నేను లీగల్గా కోర్టులోనే పోరాడుతాను” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది సింగర్ చిన్మయి. ఇకపోతే చిన్మయి పాడిన తమిళ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపై కూడా చిన్మయి మాట్లాడుతూ.. “సింగర్ ధీ అందుబాటులో లేకపోవడం వల్లే నేను ఈ పాట పాడాను. అయితే ఆమె పాడిన పాట కంటే నేను పాడిన పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అయితే దీనిని చూసి కొంతమంది మా మధ్య రెజ్లింగ్ అన్నట్టు పోటీ పెట్టి చూస్తున్నారు. అలా పోల్చాల్సిన అవసరం లేదు. ఆమె చాలా మంచి సింగర్. నాకంటే కూడా గొప్పగా పాడుతుంది. ఈమె వండర్ క్రియేట్ చేస్తుంది. ఇంకా వయసులో చిన్నది కాబట్టి ఫ్యూచర్లో వందమంది చిన్మయిలని, శ్రేయా ఘోషల్ని కూడా బీట్ చేయగలదు” అంటూ సింగర్ ధీపై ప్రశంసల వర్షం కురిపించారు చిన్మయి. మొత్తానికి అయితే మళ్లీ తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటుంది చిన్మయి. మరి ఇప్పటికైనా కోలీవుడ్ లో విధించిన బ్యాన్ తీసివేస్తారేమో చూడాలి.
"I sang #MuthaMazhai, as Dhee was not available, but didn't expect this response🫶. It feels like Me & Dhee was put on wrestling to fight😀. I Apologise to Dhee, she is very young, After 15 years she might eat 100 Chinmayi & ShreyaGhoshal🤝"
– Chinmayipic.twitter.com/s0u844fVja— AmuthaBharathi (@CinemaWithAB) June 2, 2025