BigTV English

Geetha Madhuri: ఎన్టీఆర్ పేరు వచ్చేలా గీతా మాధురి కొడుక్కి నామకరణం.. ఏం పేరు పెట్టారంటే

Geetha Madhuri: ఎన్టీఆర్ పేరు వచ్చేలా గీతా మాధురి కొడుక్కి నామకరణం.. ఏం పేరు పెట్టారంటే


Geetha Madhuri: సింగర్ గీతా మాధురి.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో పాటలు పాడి తన గాత్రంతో ఆడియన్స్‌ మనస్సును దోచుకుంది. మాస్, క్లాస్ వంటి సాంగ్స్ పాడటంలో ఆమె స్పెషలిస్ట్. ఎలాంటి లిరిక్స్‌నైనా చాలా ఈజీగా పాడేస్తుంది. చాలా సినిమాల్లో ఎన్నో పాటలు పాడి టాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఆమె పాడిన పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్. అయితే ఆమె 2014లో నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చాలా ఏళ్లకి అంటే 2019లో పండంటి ఆడబిడ్డకి గీతామాధురి జన్మనిచ్చింది.


అనంతరం మళ్లీ సాంగ్‌పై ఫోకస్ పెట్టిన ఈ గొంతు.. పలు సినిమాలలో తన వాయిస్‌తో అందరినీ అలరించింది. అయితే ఈ మధ్య సాంగ్స్ పాడటంలో కొంచెం దూరమైంది. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్.

READ MORE: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి..

ఈ విషయం అందరికీ తెలిసినా.. తాను మరో బిడ్డకి జన్మనిచ్చిందని మాత్రం ఆమె చెప్పినంత వరకు ఎవ్వరికీ తెలియదు. తమకు ఫిబ్రవరి 10న మగబిడ్డ జన్మించాడంటూ గీతా మాధురి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పుకొచ్చింది.

దీంతో సెలబ్రెటీలు, అభిమానులు, సన్నిహితులు నందు, గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ దంపతుల మొదటి ఆడబిడ్డకు ప్రకృతి అనే పేరు పెట్టగా.. ఇప్పుడు పుట్టిన మగ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఈ నేపథ్యంలో ఈ జంట తమ బిడ్డకు బారసాల వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులతో పాటు ఇండస్ట్రీ నుంచి కొందరు సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ బుడ్డోడే కాదు.. పేరు కూడా క్యూట్‌‌గానే ఉంది. ఇందులో భాగంగా వారి బిడ్డకు ‘ధృవధీర్‌ తారక్‌’ అని నామకరణం చేశారు.

READ MORE:సమంతకు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌

దీంతో మీ బుడ్డోడు పేరు భలే క్యూట్‌గా ఉందంటూ పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ బారసాల ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×