BigTV English

Samantha: సమంతకు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌

Samantha: సమంతకు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌

samantha new movie


Samantha – Thalapathy Vijay New movie(Cinema news in telugu): టాలీవుడ్ స్టార్ నటీమణులలో సమంత ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈ ముద్దుగుమ్మ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన ఆమె సినీ కెరీర్.. ఎవరికీ అందనంత ఎత్తుకి చేరుకుంది. ఇక ఇప్పటికీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఇటీవలే బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ ద్వారా హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సినిమాలతో దూసుకుపోతోంది అన్న సమయంలో ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.


చాలా రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి చక చకా సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించింది. యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో అందరి మనసులు దోచుకుంది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులు ఎంజాయ్ చేసేందుకు వేకేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసింది. అలా మరికొన్ని రోజులు విదేశాల్లో తిరుగుతూ తన సమయాన్ని ఆనందంగా గడిపింది.

READ MORE: ఏపీ ఎలక్షన్‌లో గ్లామర్‌ డోస్‌, సమంత ఎంట్రీ

అయితే రీసెంట్‌గా ఆమె బాలీవుడ్‌లో నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో మళ్లీ పాల్గొన్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో వరుణ్ దావన్, సమంత కలిసి ‘సిటాడెల్’ అనే సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ హాలీవుడ్‌కి రీమేక్‌గా రూపొందుతోంది. హాలీవుడ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా నటించింది. ఇప్పుడు హిందీలో సమంత నటిస్తోంది.

అయితే ఈ సిరీస్ చేస్తున్న మధ్యలో సమంత తనకు ఆరోగ్య కారణాలవల్ల కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంగానే ఆమె మళ్లీ ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్ తర్వాత సమంత ఎలాంటి మూవీని ఎంచుకుంటుంది. ఎవరితో చేస్తుంది అనే ఆసక్తి అందిరిలోనూ ఉంది.

ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ అమ్మడుకి తాజాగా ఓ స్టార్ హీరోతో జోడీగా నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయతో కలిసి నటించేందుకు మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు టాక్.

READ MORE: రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. కానీ ఆ కండిషన్స్ తప్పవటా..!

ప్రస్తుతం దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది విజయ్ కెరీర్‌లో 68వ సినిమాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత విజయ్ తన కెరీర్‌లో 69వ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత రాజకీయంగా ప్రజల్లో మమేకమై పోతానని ఇటీవల తెలిపాడు.

అయితే ఆయన ఇప్పుడు తన 69వ సినిమాకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఆయన చివరి మూవీ అని కూడా సమాచారం. అందువల్ల ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అందులో కార్తీక్ సుబ్బరాజు గానీ, ఆర్జే బాలాజీ గానీ ఈ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇందులో విజయ్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు సమంతను తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఇదే నిజమైతే సమంత – దళపతి విజయ్‌ కలిసి నటిస్తున్న నాలుగో సినిమా ఇదే అవుతుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×