Big TV Kissik Talks:శివాజీ రాజా (Sivaji Raja).. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ‘అమృతం’ సీరియల్ ద్వారా అటు బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరైన ఈయన పలు సినిమాలలో హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, తన నటనతో తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఒకవైపు నటుడుగానే కాకుండా.. మరొకవైపు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కూడా తనలోని టాలెంట్ ను నిరూపించారు. ముఖ్యంగా రాజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించిన శివాజీ రాజా.. ఆ చిత్రాలతో మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే అన్నింటిని హ్యాండిల్ చేయలేక ఒక్కొక్కటిని వదులుకుంటూ వచ్చాను అంటూ తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు శివాజీ రాజా. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ బ్యూటీ వర్ష (Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అందుకే ఇంటర్వ్యూ లకు దూరంగా ఉన్నాను – శివాజీ రాజా
ఈ కిస్సిక్ టాక్స్ షోలో భాగంగా వర్ష మాట్లాడుతూ.. “ఒకప్పుడు వరుస సినిమాలు, సీరియల్స్ చేసి ఎంతో పేరు సొంతం చేసుకున్న ఈయన, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మా టాక్ షో ద్వారా ఆడియన్స్ కి దగ్గర అవడం చాలా సంతోషంగా ఉంది” అని వర్షా కామెంట్ చేయగా.. శివాజీ రాజా మాట్లాడుతూ..” ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకేం భయం కాదు.. కాకపోతే ఆ వీడియోలకు పెట్టే థంబ్ నెయిల్స్ అంటేనే నాకు నచ్చదు. లోపల మ్యాటర్ ఏమీ ఉండదు.కానీ బయటపెట్టే హెడ్ లైన్స్ మాత్రం చిరాకు తెప్పిస్తాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు పెట్టే థంబ్ నెయిల్స్,వీడియోలో లోపల ఉండే మ్యాటర్ చూసి అనవసరంగా ఎందుకు ఇచ్చానో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే గత మూడు సంవత్సరాలుగా ఇంటర్వ్యూలకి కూడా నేను దూరంగా ఉన్నాను” అంటూ శివాజీ రాజా తెలిపారు.
ALSO READ:Amalapaul: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. భర్తకు తెలియదంటూ నిజాలు బయటపెట్టిన హీరోయిన్..!
తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టేవారిని అప్పట్లో అరెస్టు చేసేవారు..
ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా.. ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ వీడియోలకు పెట్టే థంబ్ నెయిల్స్ పైన మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించగా.. “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా ఉన్నప్పుడు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. వారు నా కంప్లైంట్ సీరియస్గా తీసుకొని ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. మీ దగ్గరికి అలా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్లు ఉన్నారా? అని అడిగితే చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళందర్నీ స్టేషన్ కి తీసుకెళ్లి మరీ వారితో కంప్లైంట్ రైజ్ చేయించి, అలాంటి వారిని అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే పోలీసు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్లు. అయితే ఆ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మరింత బలపడింది ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే అరెస్టు చేస్తారు. సెలబ్రిటీలకు న్యాయం చేకూరుస్తారు.. అంటూ తెలిపారు శివాజీ రాజా. మొత్తానికైతే ఈయన కూడా యూట్యూబర్స్ పెట్టే థంబ్ నెయిల్స్ పై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.