Realme 15 Pro| ప్రసిద్ధ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఈ నెలలో భారతదేశంలో కొత్త రియల్‌మి 15 5జీ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో రియల్‌మి 15 ప్రో 5జీ మోడల్ ఉంది. ఈ ఫోన్ గేమింగ్, ఏఐ స్పెషల్ ఫీచర్లతో రాబోతోందని సమాచారం.
విడుదల తేదీ, ముఖ్యాంశాలు
రియల్‌మి 15 5జీ సిరీస్ జులై 24న భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. రియల్‌మి 15 ప్రో 5జీని అత్యంత అడ్వాన్స్ ఏఐ ఫీచర్ గల “ఏఐ పార్టీ ఫోన్”గా ప్రచారం చేస్తున్నారు. ఈ ఫోన్ రోజువారీ ఉపయోగంతో పాటు, కాన్సర్ట్‌లు లేదా పార్టీల వంటి చురుకైన లైటింగ్ పరిస్థితుల్లో గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
ఈ ఫోన్.. ఆంటుటు బెంచ్‌మార్క్ స్కోరు 1.1 మిలియన్లకు పైగా ఉందని కంపెనీ చెబుతోంది. ఈ స్కోర్ తో రియల్‌మి 15 ప్రో.. హానర్ 200 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్‌ప్లస్ నోర్డ్ 4 వంటి మిడ్-రేంజ్ ఫోన్‌లతో పోటీ పడుతుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్
రియల్మీ 15 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4ఎన్ఎమ్ టెక్నాలజీతో తయారైంది. ఈ ప్రాసెసర్ మూడు ముఖ్యమైన విభాగాల్లో మెరుగైన పనితీరును అందిస్తుంది.
సీపీయూ: ఫోన్ వేగం, యాప్‌లను సజావుగా నిర్వహిస్తుంది.
జీపీయూ: గేమింగ్, గ్రాఫిక్స్‌ను మెరుగుపరుస్తుంది.
ఎన్‌పీయూ: ఏఐ సంబంధిత టాస్క్‌లను, ఫోటోగ్రఫీ వాయిస్ అసిస్టెంట్‌లను మెరుగుపరుస్తుంది.ఈ అప్డేట్లు ఫోన్‌ను వేగవంతం చేస్తాయి. గేమింగ్‌ను సాఫీగా చేస్తాయి. స్మార్ట్ ఏఐ ఫీచర్లను అందిస్తాయి.
జీటీ బూస్ట్ 3.0: గేమర్స్ కోసం
రియల్‌మి 15 ప్రో 5జీలో జీటీ బూస్ట్ 3.0 ఫీచర్ గేమింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది ఫ్రేమ్-బై-ఫ్రేమ్ పనితీరును సజావుగా చేస్తుంది. గేమర్లకు దీంతో మరింత ఎంజాయ్ చేస్తూ వినియోగించగలరు. ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు 120 ఫ్రేమ్‌లు సెకనుకు స్థిరంగా రన్ అవుతాయని రియల్‌మి చెబుతోంది. అంటే లాగ్ లేదా అడ్డంకులు లేకుండా సాఫీగా ఆడవచ్చు.
గేమింగ్ కోచ్ 2.0, ఏఐ అల్ట్రా టచ్ కంట్రోల్
గేమింగ్ కోచ్ 2.0 గేమింగ్ సమయంలో రియల్-టైమ్ సలహాలు, వ్యూహాలను అందిస్తుంది. ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఏఐ అల్ట్రా టచ్ కంట్రోల్ స్క్రీన్‌ను వేగంగా.. కచ్చితంగా స్పందించేలా చేస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన గేమింగ్ క్షణాల్లో ఇది ఉపయోగపడుతుంది.
ఏఐ-పవర్డ్ కెమెరా
ఈ ఫోన్ పార్టీల కోసం రూపొందిన ఏఐ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. కాన్సర్ట్‌లు లేదా డాన్స్ ఫ్లోర్ వంటి చురుకైన లైటింగ్‌లో, కెమెరా షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. అందమైన ఫోటోలను అందిస్తుంది.
మెమరీ, స్టోరేజ్ రంగులు
రియల్‌మి 15 ప్రో 5జీ నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది:
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్
12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్
ఈ ఫోన్ సిల్వర్, గ్రీన్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. యువతకు ఆకర్షణీయంగా ఉంటుంది.
ఫుల్ కాంపెటీషన్
ఈ ఫోన్ హానర్ 200 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్‌ప్లస్ నోర్డ్ 4 వంటి మిడ్-రేంజ్ ఫోన్‌లతో పోటీపడుతుంది. అధిక పనితీరు స్కోర్‌లు, గేమింగ్ టూల్స్, ఏఐ ఫీచర్లు దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
రియల్‌మి 15 ప్రో 5జీ గేమర్స్, పార్టీ ప్రియులు, టెక్ ఔత్సాహికుల కోసం రూపొందిన ఫీచర్-ప్యాక్డ్ ఫోన్. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4, జీటీ బూస్ట్ 3.0, ఏఐ ఫీచర్లతో, ఇది సాఫీగా గేమింగ్, స్మార్ట్ ఫోటోగ్రఫీ.. వేగవంతమైన పనితీరును అందిస్తుంది. జులై 24న భారతదేశంలో విడుదల కానున్న ఈ ఫోన్ గేమింగ్, పనితీరు కోసం ఒక గొప్ప ఆప్షన్.